సాధారణంగా వయస్సైన లక్షణాలు మొదటగా ముఖంలోనే కనబడుతాయి. ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా స్త్రీలకు వయస్సైన లక్షణాలు ఏమాత్రం కనబడటం ఇష్టం ఉండదు. స్త్రీలకు అతి పెద్ద శత్రువు ఏజింగ్. ముఖంలో ముడుతలు, సన్నని చారలు కనబడ్డాయంటే అందాన్ని అలర్ట్ చేస్తుంది, వెంటనే మిమ్మల్ని మీరు మార్చుకోవాలని తెలుపుతుంది. ఏజింగ్ ఇష్టపడని వారే కాదు, ముఖంలో ముడుతలు, చారలు కనబడేవారు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందుకోసం ఎంతో దూరం వెళ్ళాల్సిన పనిలేదు, బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.


కేవలం మీ ఇంట్లో ఉండే కొబ్బరి నూనెను రొటీన్ గా వాడితే చాలు ఈ ఏజింగ్ సమస్యను దూరం చేయవచ్చు. కొబ్బరి నూనె న్యాచురల్ ఆయిల్ మాత్రమే కాదు ప్రభావవంతంగా మరియు సురక్షితంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే కొన్ని గుణాలు ఏజింగ్ లక్షణాలను దూరం చేసి యవ్వనంగా కనబడేలా చేస్తుంది. అది ఎలా అంటే కొన్ని చుక్కల కొబ్బరినూనెను చేతి వేళ్ళపై వేసుకుని ముఖానికి మరియు మెడకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని మరియు మెడను శుభ్రం చేసుకోవాలి లేదా నూనె అప్లై చేసిన తర్వాత రాత్రి మొత్తం కూడా అలాగే వదిలేసి ఉదయం శుభ్రం చేసుకోవచ్చు.ఇలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మ కణాలను బలోపేతం చేయడానికి మరియు స్కిన్ ఎలాసిటి పెంచడానికి కొబ్బరి నూనె, కలబంద మరియు కీరదోసకాయ వంటి కాంబినేషన్ ఉపయోగించవచ్చు. మీ సమస్య త్వరగా మరియు ఎఫెక్టివ్ గా పరిష్కారం అవుతుంది.



అది ఎలా చేయాలంటే ముందుగా కీరదోసకాయ తొక్కను తీసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ లో కొద్దిగ కొబ్బరి నూనె, అలోవెర గుజ్జు మిక్స్ చేసి ముఖానికి మెడకు అప్లై చేసి సున్నితంగా మరియు పూర్తిగా చర్మం లోకి గ్రహించేలా మసాజ్ చేసి ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి కనీసం మూడు సార్లు కనుక చేస్తుంటే ఖచ్చితంగా మీ చర్మంలో మార్పు వస్తుంది. అలానే చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: