సాధార‌ణంగా చ‌లికాలం వచ్చిందంటే చాలు చర్మం తెల్లగా పొడిబారిపోతుంది.  చలికాలంలో చర్మసమస్యలు కూడా అధికంగా ఉంటాయి. ఈ సీజన్‌లోనే గాలిలో తేమ బాగా తగ్గుతుంది. దీనివల్ల ప్రధానంగా చర్మం పొడిబారటం, పగలటం,మంటపెట్టడం, చిటపటలాడటం, దురద పెట్టడం వంటి సమస్యలు ఏర్పడతాయి. తగిన జాగ్రత్తలు పాటించకపోతే చర్మం ముడతలతో అందహీనంగా కనిపిస్తుంది.  డ్రై స్కిన్‌ ఉన్నవారికి ఈ కాలంలో ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉంటాయి.


జిడ్డు చర్మం ఉన్న వారికీ సమస్యలు తప్పవు. ఇలాంటి సమస్యల నుండి రక్షించుకోవడానికి తగినంత శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. కేవలం ఇంటి చిట్కాలతోనే చర్మం మృదువుగా కాంతివంతగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మ‌రి అవేంటో ఓ లుక్కేయండి..


-  ఒక బొప్పాయి, ఒక అరటిపండు మెత్తగా చేసి అందులో కాస్తంత తేనె వేసి మెత్తగా పేస్టులా చేసి చర్మానికి రాసుకుంటే చర్మం పొడారకుండా మృదువుగా తయారవుతుంది.


- గులాబీనీరూ, తేనె సమానంగా తీసుకుని బాగా కలిపి ముఖం, మెడకు రాసుకోవాలి. పదినిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తేనె చర్మానికి తేమనందిస్తుంది.


- పెరుగు, పసుపు, తేనెలను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు ఆగాక చల్లని నీటితో క్లీన్ చేసుకుంటే చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.


- మరీ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం మీద ఉండే కాస్త తేమ కూడా ఆవిరైపోయి, మరింత పొడిబారిపోతుంది. స్నానానికి చల్లటి నీరు లేదా గోరువెచ్చటి నీటిని మాత్రమే వాడాలి.


- ఓట్‌మీల్‌ పొడిలో బాదం, నారింజ పొడిని వేసి మెత్తటి మిశ్రమంలా తయారుచేసి దాన్నిముఖానికి పట్టించి మెల్లగా మసాజ్‌ చేసి కాసేపైన తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటే చర్మం మెరుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: