పూర్వం కురులు నల్లగా , నిగనిగలాడుతూ, ఎంతో ధృడంగా , మర్రిచెట్టు ఊడల్లా బలంగా ఉండేవి. అప్పటికి, ఇప్పటికి మరి ఏమిటి తేడా అంటే మారుతున్న కాలం, టెక్నాలజీ కి తగ్గట్టుగా విస్తరిస్తున్న కాలుష్యం, స్వచ్చమైన ఆహార నియమాలు లేకపోవడం,ఇలా రకరకాల కారణాలు మన అందాన్ని ఆరోగ్యాన్ని రెండిటిని శిధిలావస్థలోకి నెట్టేస్తున్నాయి. అయితే ఇప్పుడు కూడా కురులని బలంగా మార్చుకోవచ్చు , ఆరోగ్యంగా చేసుకోవచ్చు అందుకు కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. అవేంటంటే...

 

వెల్లుల్లిపాయలు తీసుకుని అందులో పైన ఉండే పొట్టు తీసి. వేయించాలి. వేయించాగా వచ్చిన పొట్టు పొడిని కొబ్బరి నూనె, లేక మందార నూనె లో వేసుకుని జుట్టుకు పట్టించడం వలన అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇక వారానికి రెండు సార్లు అయినా సరే కొబ్బరి నూనె జుట్టుకు పట్టించాలి. ఎందుకంటే. జుట్టుకు బలం రావాలంటే తప్పకుండా పోషక విలువలతో పాటు కుదుళ్ళు గట్టిపడేలా నూనేని కూడా పట్టించాలి.

 

చాలా మంది చల్లని నీటితో స్నానం చేసేస్తారు. అలా చేయకూడదు. గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి. ఉసిరి , కుంకుండు, శీకాయ మిశ్రమాన్ని తీసుకుని సుమారు 20 నిమిషాల పాటు నానబెట్టి ఆ గుజ్జుని తలకి పట్టించాలి. ఆ తరువాత తల స్నానం చేయడం వలన జుట్టు బలంగా తయారవుతుంది. వాల్ నట్స్ కొన్ని తీసుకుని వాటిని క్యారెట్ తురిమినట్టుగా తిరుముకోవాలి. ఇలా వచ్చిన దాన్ని తీసుకుని నీటిలో వేసి మరగబెట్టి ఆ నీటిని దూది సాయంతో కుదుళ్ళ కి పట్టిస్తే మంచి ఫలితం కన్పిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: