సాధారణంగా డ్రైఫ్రూట్స్‌లో ఉండే పోషకాల గురించి వినే ఉంటారు. అంజీర్, బాదం, పిస్తా, అక్రోట్టు, ఆఫ్రికాట్, చెర్రి, ఖర్జూర, కాజు, కిస్మిస్, అల్ బుకార ఇలా ఎన్నో ర‌కాలు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. శరీరంలో ఒక బలమైన వ్యాధినిరోధక వ్యవస్థ పొందడానికి రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో ఈ డ్రైఫ్రూట్స్ ను చేర్చుకోవడం మంచిద‌ని అంద‌రికి తెలిసిందే. అయితే డ్రై ఫ్రూట్స్‌తో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించుకోవ‌చ్చు. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. మ‌రి  డ్రై ఫ్రూట్స్ తో కొత్త అందాలను ఎలా పొంద‌వ‌చ్చు ఇప్పుడు తెలుసుకుందాం..


- బాదం పప్పులను పొడి చేసి నీళ్లలో నానబెట్టి పాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి ముఖంపై రాసుకోవాలి. ఇది ముఖం చర్మంలోని మృత కణాలను, మడ్డిని తొలగిస్తుంది. దాంతో ముఖం కళకళలాడిపోతుంది.


- హెయిర్ లాస్, హెయిర్ డ్యామేజ్ మరియు ఇతర జుట్టు సంబంధిత సమస్యలను నివారించడంలో డ్రై ఫ్రూట్స్ గొప్పగా సహాయపడుతాయి. మరియు జుట్టు పెరుగుదలకు దోహదం చేసి జుట్టును స్ట్రాంగ్ గా ఉంచుతుంది.


- పెరుగులో కొన్ని ఆక్రోట్లు(వాల్ నట్స్) వేసి మెత్తగా చేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖంపై సబ్బులా రుద్దుకోవాలి. ఆక్రోట్ల నూనెలో ఉండే లినోలిక్ యాసిడ్ చర్మంపై ముడతలు, గీతలు రాకుండా నివారిస్తుంది.


- డ్రై ఫ్రూట్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే వృద్ధాప్య ఛాయలను నివారించ‌వ‌చ్చు. ఇందులో వృద్ధాప్య ఛాయలను నివారించే యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.


- రోజుకు కొన్నిజీడిప‌ప్పులు తిన‌డం వ‌ల్ల ఎండ ప్రభావంతో పాలిపోయిన చర్మాన్ని ఇది సరి చేస్తుంది. కాలి పగుళ్లను కూడా తగ్గించగలదు. వీటిలో ఉండే విటమిన్ ఇ చర్మంపై వయసు ప్రభావం పడనీయకుండా కాపాడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: