జుట్టు శరీరంలో ఎంతో అందమైనది.. అయితే అలాంటి జుట్టును ఎంత జాగ్రత్తగా చూసుకున్న ఈ వర్షాల కారణంగా, దుమ్ముదూళి కారణంగా జుట్టు రాలుతూనే ఉంటుంది. అయితే ఈ జుట్టు రాలటం ఆగి.. ఒత్తుగా పెరగాలి అంటే ఈ నూనెల చిట్కాలు ఉపయోగించి మీ జుట్టుని కాపాడుకోండి. అయితే ఏ నూనె ఉపయోగిస్తే జుట్టు అందంగా ఉంటుంది ఇక్కడ చదివి తెలుసుకోండి.  
జుట్టుకు ఆముదంతో మర్దన చేయటం వల్ల జుట్టు రాలటం ఆగి, నల్లని, ఒత్తైన జుట్టు సొంతమవుతుంది. 


కుదుళ్ళ నుంచి చివరి వరుకు జుట్టు దృఢంగా ఉండాలంటే ఉసిరినూనె వాడాలి. రాత్రి నిద్రకుముందు ఉసిరి నూనె తలకు పట్టించుకుని మర్దన చేసుకుంటే అలసట తొలగిపోతుంది. చుండ్రు, జుట్టురాలడం, తలనొప్పి వంటివి తగ్గిపోతాయి. 


జుట్టు పలుచగా ఉంటె స్వీట్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ వారానికి 2 సార్లు ఉపయోగిస్తే ఎంతో ఒత్తుగా పెరుగుతుంది. 


అవకాడో నూనె కూడా ఆరోగ్యకరమైన జుట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నూనెను కూడా కానీ వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే మంచిది. 


ఆరోగ్యమైన అందమైన జుట్టుకు సహాయపడే ఆయిల్ ఆలివ్‌ ఆయిల్‌. ఈ ఆయిల్ తో జుట్టు రాలకుండా, చుండ్రు చేరకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: