ద్రాక్ష పండ్లు అతి ప్రాచీనమైన కాలం నుండి సాగుచేస్తున్న పండ్లు. వీటి సాగు క్రీస్తు పూర్వం ఐదువేల ఏళ్ల కిందటే ఆసియా ప్రాంతంలో జరిగేది. వీటిలో ఉండే పోషక పదార్థాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితనం పెరుగుతుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడవు. అజీర్తి, మల బద్ధకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. వీటిలోని అనేక విటమిన్లు, ఖనిజాలు మీ ఆరోగ్యానికి పూర్తి రక్షణ కలిగిస్తాయి. అలాగే ద్రాక్ష వ‌ల్ల ఆరోగ్యంతో పాటు మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చు.. అది ఎలాగో ఓ లుక్కేసేయండి..


- ద్రాక్షరసంలో పెరుగు, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వాష్ చేసుకుంటే.. ముఖచర్మాన్ని శుభ్రపరచి మృదువుగా ఉంచుతుంది.


- ద్రాక్ష‌ తొక్కలను ముఖానికి మాస్క్‌లా వేసుకోవడం ద్వారా చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇందులో యాంటీయాక్సిడెంట్లు చర్మానికి క్లెన్సర్‌లా ఉపయోగపడుతుంది. 


- ద్రాక్ష పండ్లను కట్ చేసి ఆ రసాన్ని కంటి కింద నల్లటి వలయాలపై రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కంటి కిందటి వలయాలకు చెక్ పెట్ట‌వ‌చ్చు.


- ద్రాక్ష రసంలో ఎగ్‌లోని తెల్లసొనను కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌ వేసుకుని కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకోసువాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ చర్మం పొడిబార‌కుండా ఉంటుంది.


- ఒక కప్పు తెల్లద్రాక్ష తీసుకుని వాటిని మెత్తగా పేస్ట్ చేసి, అందులో టేబుల్‌స్పూన్‌ తేనె వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లే చేయాలి. దీని వ‌ల్ల ముఖంపై మురికి పోయి ముఖం తేటగా అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: