మందారం.. పువ్వు ఎర్రగా ఉన్న.. అది వాడితే జుట్టు నల్లగా అవుతుంది. అదే మందారం ప్రత్యేకత. జుట్టు రాలె ప్రతి ఒకరికి ఆ సమస్య నుంచి ఎలా బయట పడాలో తెలియదు. ఎన్ని రకాల మందులు ఉపయోగించిన సరే ఫలితం అసలు ఉండదు. ఆలా అని వైద్యులను కలిసిన సరే పెద్ద ఉపయోగం ఉండదు. 


ఇంకా చెప్పాలంటే వైద్యుల దగ్గరకు వెళ్లడం వల్ల డబ్బు ఖర్చు అవుతుంది కానీ.. జుట్టు రాలడం మాత్రం తగ్గదు. కానీ సహజసిద్ధమైన మందారం, అమల వంటి వాటిని ఉపయోగించి జుట్టు రాలడం చిటికెలో తగ్గించచ్చు. అయితే ఆ చిట్కాలు ఎలా పాటిస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుందో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


మందారం.. ఈ మందారం పూల రెక్కల రసాన్ని ప్రతిరోజూ జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది. ఆ మందారం రసం కోసం ఎండబెట్టిన మందార పూలను నీళ్లలో వేసి మరిగించి ఈ రసాన్ని తలకు రాసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల జుట్టు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. 


మందార నూనె..  మందార పూలను కప్పు కొబ్బరినూనెలో వేసి ఆ తర్వాత ఆ నూనె మత్రమే మిగిలేలా సన్నటి మంటపై కాల్చాలి.. అనంతరం ఆ నూనె వల్ల జుట్టు రాలడం తగ్గి, నల్లగా మెరిసిపోతుంది. 


ఆమ్ల నూనె.. ఉసిరి కాయలను కొబ్బరి నూనెలో బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నూనెను నిత్యం తలకు పట్టిస్తే జట్టు రాలే సమస్య చాలవరుకు తగ్గుముఖం పడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: