జట్టుకి ఆత్మవిశ్వాసానికి చాలా దగ్గర సంభంధం ఉంటుంది. ఎంతో ఒత్తయిన జుట్టుతో ఉండే వారు ఒక్క సారిగా జుట్టు కోల్పోతే మానసికంగా ధృడత్వాన్ని కోల్పోతారు. అంతేకాదు అది ఎంతో అవమానంగా భాదపడుతారు. అందుకే మనం తినే తిండి మొదలు, పడుకునే విధానం వరకూ కూడా ఎన్నో విషయాలు జుట్టుని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా జుట్టు ఊడిపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే చుండ్రు. ఈ చికాకు పెట్టించే చుండ్రు ఏమి చేస్తుందిలే అనుకుంటే పొరబాటే...

 

మరి జుట్టు ఊడిపోయి బట్టతలా రావడానికి కారణం అయ్యే చుండ్రు కి చెక్క పెట్టడానికి ఆయుర్వేదంలో ఎన్నో పద్దతులు ఉన్నాయి. కానీ అన్నిటికంటే అందరూ ఆచరించే అద్భుతమైన సత్ఫలితాలు ఇచ్చే పద్దతితులని ఇప్పుడు పరిశీలిద్దాం.

 

కర్పూరం జుట్టు రక్షణలో , జుట్టులో ఉండే పేలని చంపడానికి , చుంద్రుని తరిమి కొట్టడానికి ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. పూర్వం మీ తాతలు, మామ్మలు నూనె తలకి పట్టించే క్రమంలో కర్పూరం వాసన రావడాన్ని మీరు గమనించే ఉంటారు ఇప్పడు అదే పద్దతిలో కొబ్బరి నూనెలో కొంత కర్పూరం చితకొట్టి వేయండి ఆ తరువాత ఆ మిశ్రమాన్ని తలకి దిట్టంగా పట్టించడం వలన జుట్టుకి చుండ్రు పట్టడం మానుతుంది.

 

వేపాకు కూడా చుండ్రుని తరిమేయడంలో కీలకంగా ఉంటుంది. కొన్ని వేపాకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి, మెత్తటి పేస్టులా చేసుకుని తలకి బాగా పట్టించండి. వేపాలో ఉండే గుణాలు తలపై చుండ్రుని నిమిషం కూడా ఉండనివ్వవు, పేలు కూడా ఆ చేదుకి భయపడి పారిపోతాయి. తద్వారా జుట్టు ఎంతో ధృడంగా పట్టులా మారుతుంది. చుండ్రుతో పాటు పేరు కూడా పోతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: