మనదేశంలో పూర్వకాలం నుంచే పాల నుండి వెన్నను, వెన్న నుండి నెయ్యి, మీగడ తయారు చేయడం జరుగుతోంది. వెన్నెలో దాదాపు 25శాతం నీరే ఉంటుంది. నిజానికి వెన్న వల్ల కలిగే లాభాల ఏమిటో చాలా మందికి తెలియదు. వెన్నలో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా-3, ఒమెగా-6, ఫ్యాటీ యాసిడ్సూ ఎక్కువే. ఇవి వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు వెన్నలో అధికంగా ఉండే కాల్షియం, పాస్ఫరస్, విటమిన్-ఎ,డి ల శాతం రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి. అలాగే వెన్న చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అవేంటో ఓ లుక్కేసేయండి..!


- వెన్న, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి కళ్లకింద ఏర్పడిన నల్లని చారలకు, ముడతలకు రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ ముడతలు పోతాయి.


- చర్మవ్యాధులకు వెన్న దివ్య ఔషధంగా పనిచేస్తుంది. హెర్బల్‌ అయింట్‌మెంట్‌గా కూడా ఇది పనిచేస్తుంది. వెన్నలో పసుపు కలిపి పాదాల పగుళ్లకు రాస్తే దురద, మంట తగ్గుతుంది. పగుళ్లు తగ్గిపోతాయి.


- వెన్న, ఆరెంజ్ రసం కలిపిన మిశ్రమాన్ని పెదవులకు పట్టించాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల‌ పెదవులు అందంగా మృదువుగా మెరుస్తాయి.


- వెంట్రుకల మృదుత్వానికి కూడా వెన్నను వాడుతుంటారు. ప్రతిరోజూ వెన్నలో నల్ల నువ్వులు కలిపి ఒక మాత్రలా చేసి తింటే జుట్టు నెరవకుండా ఉంటుంది.


- వెన్న, తేనె మిశ్రమంతో నోటిని శుభ్రం చేసుకుంటే నోటి దుర్వాసన, ఇతర రోగాలు మాయమవుతాయి. 


- పసి పిల్లలకు స్నానం చేయించడానికి ముందు వెన్నను ఒంటికి పట్టించి, నలుగు పెట్టి స్నానం చేయిస్తే చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. వంటిపై ఉన్న వెంట్రుకలూ రాలిపోతాయి



మరింత సమాచారం తెలుసుకోండి: