నేటి త‌రుణంలో కేవ‌లం మ‌హిళ‌లు మాత్ర‌మే కాదు, పురుషులు కూడా త‌మ శిరోజాల‌కు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. వాటిని సంర‌క్షించుకోవ‌డం కోసం అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. సాధార‌ణంగా చాలా మంది వెంట్రుక‌లు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌డం కోసం ర‌క ర‌కాల స్టైల్స్ కూడా చేసుకుంటున్నారు. అయితే ఎంత స్టైల్ చేయించుకున్నా జుట్టు ఒత్తుగా, దృఢంగా, కాంతివంతంగా ఉంటేనే ఆ స్టైల్స్ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తాయి. 


జుట్టు పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుండటం దాదాపు అందరి సమస్య. అయితే అలోవెరా జెల్‌లో సహజసిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. అలోవెరా జెల్‌ని జుట్టుకు రాయడం వల్ల నిగ‌నిగ‌లాడుతుంది. అలాగే అలోవెరా జెల్‌ని తలకు పట్టించి ఓ గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు పెరగటమే కాకుండా, మంచి నిగారింపును సంతరించుకుంటుంది. తలకు కలబంద వాడడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది.  తలలో వచ్చే అనేక పుండ్లను దురదలను తగ్గించ‌డంలో అలోవెరా గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.


వెంట్రుకలు తెల్లబడడం, ఎర్రబడటం చుండ్రులను ఇది నివారిస్తుంది. పొడిబారినట్లుగా అనిపిస్తే, అలోవెరా జెల్‌తో తరచుగా మర్దనా చేస్తే శిరోజాలు మృదువుగా మారతాయి. ఓ పాత్రలో అలోవెరా జెల్ తీసుకుని అందులో పటిక ఉప్పు వేసి పక్కనబెట్టాలి. కాసేపయ్యాక అందులో నువ్వుల నూనె, కొబ్బరి నూనె చేర్చి బాగా మరిగించి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తలకు రాసుకుంటే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: