జామపండు తింటే ఇక ఆరోగ్యం మీచేతిలో ఉన్నట్టే. ఎందుకంటే విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్లు, పొటాషియం, మెగ్నిష‌యం… ఇలా చెప్పుకుంటూ పోతే జామ‌కాయ‌ల్లో ఉండే పోష‌కాలు ఎన్నో. రుచి రుచి ఉండ‌డ‌మే కాదు, ధర త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఈ పండు పేదోడి యాపిల్‌గా పేరుగాంచింది. ఆరోగ్యానికి ఎన్నో ర‌కాలుగా జామ పండ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే జామ పండ్లు, ఆకులు కేవ‌లం ఆరోగ్యానికే కాదు సౌందర్యపోషణకూ ఉపయోగప డుతుంది. 


చర్మ సంరక్షణకు జామ తనవంతు కృషి చేసుందని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. దీని కోసం బాగా పండిన జామ పండులోని గింజలను తొలగించి, గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో రెండు చెంచాల పాలు వేసి కలిపి ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మృదువుగా ఉంటుంది. అలాగే జామ పండు గుజ్జును ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం ఆక‌ర్ష‌నీయంగా మార‌తుంది. 


మొటిమలతో బాధపడేవారు జామ ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి లేపనం చేసుకుంటే కొద్దిరోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. జామపండ్లతో తయారు చేసిన జ్యూస్‌లు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, అందంగా, ముఖ ఛాయ పెరుగుతుందని బ్యూటీషియన్లు చెబుతుంటారు. పచ్చి జామకాయను ముద్దలా నూరి నుదుటి మీద పెట్టుకొంటే తలనొప్పి..మైగ్రేన్ సమస్య తగ్గుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: