చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మం తెగ ఇబ్బందులు పెడుతుంది. చర్మం పగుళ్లు, మంట పుట్టడం, పొడిబారడం ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అలా అని ఎన్నో క్రిములు, లోషన్లు ఉపయోగిస్తుంటుంటారు. అయితే ఆ లోషన్లు, క్రిములు కంటే కూడా సహజ సిద్ధంగా ఇంట్లోని కొన్ని చిట్కాలను ఉపయోగించడం వల్ల ఆ సమస్య త్వరగా తగ్గుతుంద. అయితే ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


చలికాలం అని వేడి నీటితో స్నానం చెయ్యకండి. ఈ వేడి నీటి వల్ల చర్మంలోని తేమ, సహజ నూనెలు కోల్పోయి చర్మం పొడిగా మారుతుంది. స్నానికి వేడి నీరు కాకుండా గోరు వెచ్చటి నీటిని ఉపయోగిస్తే మంచిది. 


చలికాలంలో చాలా మంది రకరకరాల లోషన్స్, టోనర్స్, బాడీ క్రీమ్స్ వాడుతుంటారు. అయితే అందులో ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆల్కహాల్ తక్కువ శాతం ఉన్న లోషన్స్ వాడటం మంచిది. 


చలికాలంలో ఆరెంజ్, తేనెను బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని చర్మంపై బాగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా అందంగా మారుతుంది.


టమాట గుజ్జుని తీసుకుని అందులో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారటం తగ్గి మెరుస్తుంది. 


కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం తాజాగా, కాంతివంతంగా తయారవుతుంది.


వారానికి ఓ సారి నువ్వుల నూనెతో మర్దనా చేసుకోవడం వల్ల చర్మం మిలమిల మెరిసిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: