చర్మం.. చాల సున్నితమైనది. మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటి అంటే... చర్మమనే చెప్పాలి. అయితే ఈ చర్మం దుమ్ము, దూళి భారిన పడి చర్మ సమస్యలు వస్తుంటాయి. ఈ చర్మం వ్యక్తిగత శుభ్రత లోపం, శారీరక మార్పులు వంటి ఎన్నో కారణాల వల్ల చర్మం దెబ్బతింటుంది. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇట్టే తగ్గిపోతాయి. 


దురదలు, దద్దుర్లు వచ్చాయంటే స్నానం చేసే నీటిలో కళ్లుప్పు, ఒక నిమ్మకాయ పిండి ఆ నీటితో స్నానం చేస్తే సమస్య తగ్గి శరీరం కాంతివంతమవుతుంది.


గజ్జి, తామర లక్షణాలు కనిపించిన వెంటనే తులసి ఆకు నూరి అందులో నిమ్మరసం కలిపి పట్టిస్తే లక్షణాలు మాయమవుతాయి. 


ఒంటిపై తెల్ల మచ్చలు వస్తే వాటిపై తెల్ల గన్నేరు ఆకులు నూరి పూస్తే మచ్చలు మాయమవుతాయి.


తులసి ఆకు, హారతి కర్పూరం కలిపి నూరి రాత్రిపూట శోభి మచ్చలపై రుద్ది తెల్లారి కడగాలి. ఇలా 3 వారాల పాటు చేస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతాయి.


అరికాళ్లలో ఆనెలు పెరిగితే వారంపాటు జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రుద్దితే ఆనెలు తగ్గిపోతాయి.


తేనె, నెయ్యి కలిపి పూస్తుంటే అధిక వేడి వల్ల ఒంటిపై పడిన తీవ్రమైన వ్రణాలు తగ్గిపోతాయి.


పసుపు, ఉసిరి పొడి గ్లాసు నీటిలో కలిపి సేవిస్తుంటే రక్తశుద్ధి జరిగి చర్మ సమస్యలు తగ్గుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: