కళ్లకు కాటుక పెట్టుకుంటే.. ఎలాంటి కళ్లు అయినా సరే అందంగా కనిపిస్తాయి. ఆ కాటుక కళ్ల అందానికి ప్రతి ఒక్కరు ఫిదా కావాల్సిందే. కళ్లు ఎంత చిన్నవి అయినా సరే రవ్వంత కాటుక పూసుకుంటే ఎంతో పెద్దవిగా, అందంగా కనిపిస్తాయి. అయితే కాటుక పెట్టుకోవడం వల్ల కళ్లు అందంగా మాత్రమే కాదు.. ఈ కాటుక వల్ల కళ్ళకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 


అవి ఏంటంటే.. ఎండ, దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కాటుక కంటిని కాపాడటమే గాక కళ్లను తాజాగా, మెరిసేలా చేస్తుంది. కాటుక కంటికి చలువ చేస్తుందని ఆయుర్వేదమూ చెబుతోంది. అయితే కాటుక పెట్టుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. కాటుకతో కళ్లు మరింత అందంగా కనిపించేందుకు కొన్ని చిట్కాలు. 


కాటుక పెట్టుకొనే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి కళ్లపై తడిలేకుండా తుడుచుకొని కాటుక పెట్టుకోవాలి.


ఎక్కువగా చెమట పట్టే చర్మం ఉన్నవారు కాటుక పెట్టుకునే ముందు ముఖాన్ని ఐస్‌ ముక్కలతో మర్దన చేసుకోండి. దీనివల్ల చెమట పట్టడం తగ్గి పెట్టిన కాటుక చెదరకుండా అందంగా అలాగే ఉంటుంది.


కాటుక పెట్టుకునే ముందు మెత్తని వస్త్రంతో కనురెప్పను తుడుచుకోవాలి, ఇలా చెయ్యడం వల్ల కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగా తొలిగిపోయి కళ్లు తాజాగా ఉంటాయి.


కనురెప్పల చివరి భాగంలో కాటుక పెట్టుకొంటే చెరిగిపోయే అవకాశం ఎక్కువ గనుక కనురెప్పల మధ్యన కాటుక పెట్టుకోవాలి.


కాటుక పెట్టుకునే ముందు కళ్లకి లైట్‌ కలర్‌ ఐషాడో బేస్‌గా వేసుకున్న కాటుక చెదిరిపోకుండా ఉంటుంది.


కళ్లకు నాణ్యమైన కాటుకే వాడాలి. అప్పుడే కళ్లు అందంగానూ ఆరోగ్యంగాను ఉంటాయి. 


కాగా కాటుక వాడినప్పుడు దురద పెట్టటం, కళ్ళు మంటపుట్టటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ కాటుక వాడటం ఆపేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: