బియ్యం నీళ్లు.. వంట చేసే సమయంలో బియ్యాన్ని కడిగి నీళ్లు పడేస్తుంటాం. కానీ పోషకాలు ఉండేదే బియ్యంలో అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ బియ్యం నీటి వల్ల కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఈ బియ్యం నీళ్లతో సౌందర్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. 

                             

ఈ నీళ్లలోని పోషకాలు చర్మానికి, వెంట్రుకలకు పోషణనిస్తాయి. ఇందుకోసం ఏం చేయాలంటే.. బియ్యం శుభ్రంగా కడిగి కప్పు లేదా రెండు కప్పుల నీళ్లు పోసి పావు గంట సేపు నానబెట్టాలి. తర్వాత బియ్యం బాగా పిసికి, వడగట్టాలి. ఇలా సేకరించినవే బియ్యం నీరు. ఈ నీటితో.... వెంట్రుకలకు పట్టిస్తే, జుట్టు మెరుస్తూ ఉంటుంది, కుదుళ్లు కూడా బాగా బలపడతాయి. 

                                   

ముఖానికి పట్టిస్తే మొటిమల కారణంగా ఎర్రబడిన చర్మం మామూలుగా మారుతుంది. తెరుచుకుని ఉన్న చర్మ రంధ్రాలు మూసుకుని, చర్మం బిగుతుగా మారుతుంది. బియ్యం నీటిలోని పోషకాల వల్ల చర్మం జీవం సంతరించుకుంటుంది. చర్మం నునుపుగా, ఆరోగ్యవంతంగా మారుతుంది. 

                                         
చర్మం మీద దద్దుర్లు, మంటలు లాంటి చర్మ సమస్యలు ఉన్న క్రమంగా తగ్గుతాయి. ఎండకు కమిలి నల్లబడిన చర్మం తిరిగి మామూలుగా మారుతుంది. చూశారుగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం బియ్యపు నీటిని ఉపయోగించి అందాన్ని మీ సొంతం చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: