సహజంగా జుట్టు బలహీన పడుతోంది అంటే ప్రధాన కారణం తలలో పేలు, చుండ్రు. ఇవే జుట్టు ఊడిపోవడానికి ప్రధానమైన కారణాలు. ఇవేమీ గురించక పోవడం వలన చాలా మంది అసలు సమస్యని పక్కన పెట్టి రకరకాల క్రీములు, ఆయిల్స్ ,షాంపూలు  వాడుతూ జుట్టుకి మరింత చేటు తెచ్చి పెట్టుకుంటారు. అయితే మూలాలలో సమస్యని గుర్తించి పరిష్కరింఛితే  తప్పకుండా మీ జుట్టు బలంగా ఎంతో నాజూకుగా తయారవుతుంది. మరి జుట్టు ఊడిపోవడానికి ప్రధానమైన పేలు , చుండ్రుని ఎలా కంట్రోల్ చేయచ్చో ఇప్పుడు చూద్దాం.

 

పూర్వం పేలు, చుండ్రు పోవడానికి  వెల్లుల్లి వైద్యాన్ని ఉపయోగించే వారు. వెల్లుల్లి వాసన తగిలితే చాలు పేలు పరుగులు పెట్టక మానవు అంటారు పెద్దలు. కేవలం పేలని మాత్రమే కాదు జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా ఎదిగేలా కూడా వెల్లుల్లి చేయగలదు. అందుకే పూర్వం నుంచీ కూడా జుట్టుకి వెల్లుల్లి ని పట్టించేవారు.

 

ముందుగా సహజసిద్దమైన కొబ్బరి నూనేని తీసుకోవాలి. ఆ తరువాత కొన్ని  వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటిని చితకొట్టి మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసిన తరువాత రసాన్ని బయటకి తీయాలి. సిద్దంగా ఉంచుకున్న నూనెలో నాలుగు చుక్కలు గానీ లేదంటే సరపడా రసం పోసి దాచుకోవాలి. స్నానం చేసే సుమ్మారు రెండు గంటల ముందు తలకి ఆ మిశ్రమాన్ని పట్టించి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే తప్పకుండా పేలు పారిపోవడమే కాకుండా జుట్టు ధృడంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: