పూర్వం మహిళలు పనులు తొందరగా చేసుకుని ఉదయాన్నే త్వర త్వరగా లేవడం కోసం పనులు చక్కబెట్టుకుని  రాత్రిళ్ళు తొందరగా పడుకునే వారు. తొందరగా అంటే సుమారు 8 సమయంలోగానే. కానీ ప్రస్తుత టెక్నాలజీ మారుతున్న కాలంతో పాటు అందరికి ఆహారపు అలవాట్లు, దైనందిక కార్యక్రమాలు మారిపోయాయి. ముఖ్యంగా మహిళల జీవన శైలిలో పూర్తి స్థాయిలో మార్పులు సంభవించాయి.

 

ప్రస్తుతం మహిళలు కానీ పురుషులు కానీ నిద్ర పోయే సమయం దాదాపు 12 నుంచీ 1 గంట వరకూ అవుతోంది. ఈ ప్రభావం ఇద్దరి మీద పడుతున్నా యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ఈ ప్రభావం మగవారికంటే కూడా ఆడవారిలో ఎక్కువగా ప్రభావం చూపుతోందట. నిద్ర లేమి కారణంగా మహిళల ఎముకలు మరింత బలహీనంగా మారుతున్నాయని వారి అధ్యయనంలో గుర్తించారట.

 

అవసరమైన దానకంటే కూడా తక్కువ సమయం పడుకునే మహిళల ఎముకలలో  బీఎండీ స్థాయి పూర్తిగా తగ్గిపోతోందట. దీని ప్రభావం వలన ఎముకలు పూర్తిగా బలహీనపడుతాయని, ఈ క్రమంలోనే ఎముకలు బలహీనపడి చిట్లి పోతాయని తెలిపారు. సుమారు 15 వేల మంది మహిళలపై అధ్యయనం చేసిన ఈ బృందం రాత్రి 7 గంటలకి పడుకునే వారి ఆరోగ్యం, ఎముకల ధృడత్వం ఎంతో అద్భుతంగా ఉందని, అదే రాత్రి 10 దాటినా తరువాత పడుకునే వారిలో ఎముకల సమస్యలు విపరీతం అవుతున్నాయని, కోమలంగా ఉండే మహిళల చర్మ సౌందర్యం పై , ఒత్తయిన జుట్టుపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ప్రకటించారు  మహిళలు తొందరగా పడుకోవడం మీకే కాదు ఇంటిల్లిపాదికి ఎంతో ఆరోగ్యమని అంటున్నారు పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: