అరటిపండు అన్ని వేళలా అందరికీ ప్రియమైన మరియు చౌకైన ఫలము. కొన్ని వందల సంవత్సరాల నుంచే అరటి పండు అన్ని ఋతువులలో ఎల్లవేళలా అందుబాటులో చలామణి అవుతున్న పండు. చక్కెరకేళి, అమృతపాణి... ఇలా మన దేశంలో బోలెడు రకాల అరటి పండ్లు లభిస్తున్నాయి. అరటి పండులో శరీరానికి సరిపడా కాల్షియం, ఐరన్ ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం బీపీని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. పిల్లల ఎదుగుదలకు కూడా అరటి ఉపయోగపడుతుంది. అరటి పండ్లలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి.


 
అయితే అర‌టిపండు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఎలా వాడాలో చాలా మందికి తెలియ‌దు. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి.  అరటిపండు గుజ్జు, వెన్న లేదా మీగడ తీసుకొని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాయాలి. దీనివల్ల చర్మానికి సహజసిద్ధమైన తేమ అంది చర్మం పొడి బారదు. రెండు అరటిపండ్లను ముద్దగా చేసి దానిని పేస్టులా ముఖానికి పట్టించాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకుంటే.. ఇది చర్మానికి లేత గులాబీ వర్ణాన్ని ఇస్తుంది.

 

అలాగే అర‌టి పండు గుజ్జుకు టీస్పూన్ పాలు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి చేతులు, కాళ్లకు పట్టించండి.  కొంత స‌మ‌యం  తర్వాత కడిగేయండి. ఇలా చేస్తే చర్మానికి మృదత్వాన్ని ఇస్తుంది. ప్రధానంగా జిడ్డు చర్మం గలవారికి ఎక్కువ ప్రయోజనకరం. అరటి పండ్లులో విటమిన్ ఎ, విటమిన్ బి మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉండి, యాంటీఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బాగా పండిన అరటి పండును మెత్తగా చేసి, అందులో కొద్దిగా తేనె చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ కాంతివంతంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: