చలికాలం వచ్చిందంటే అమ్మాయిలకి కంగారు పుట్టుకొస్తుంది. ఎన్నో చర్మ సమశ్యలు ఈ చలికాలంలో పుట్టుకొస్తాయి. అప్పటివరకూ నాజూకుగా, లేలేతగా ఉన్న చర్మం ఒక్కసారిగా పొడిబారిపోయి , తెల్ల తెల్ల తెట్లు కట్టినట్టుగా అందవిహీనంగా తయారవుతుంది. అలా వచ్చిన ప్రతీ సారి చాలా మంది నీళ్ళతో ముఖాన్ని కడుక్కుంటూ తాత్కాలిక ఉపశమనం పొందుతారు. అయితే చర్మం పొడిబారకుండా ఉండాలంటే ఏమి చేయాలి..

 

 

ముఖ్యంగా పూర్వం నుంచీ ఇప్పటి వరకూ అందరూ ఆచరిస్తున్న ఏకైక చిట్కా మీగడ. మీగడని పెదాలకి గానీ చేతులకి గాని పట్టించడం వలన చర్మం పొడిబారదు. మరి మీగడని ఎలా ఉపయోగించాలంటే. ఒక చెంచాడు మీగడ తీసుకుని, అందులో ఒక చెంచాడు స్వచ్చమైన తేనే కలిపి రెండిటి మిశ్రామాన్ని బాగా కలిపి ఆ తరువాత ముఖానికి పట్టించాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని కడగడం వలన చర్మం మృదువుగా మారుతుంది.

 

అలాగే పొడి చర్మం అధికంగా ఉన్న వాళ్ళు పాలు ,అరటిపండు పేస్ట్ ని రాసుకోవడం వలన మంచి ఫలితం అందుతుంది. ఒక అరటిపండు తీసుకుని మెత్తగా చేసి అందులో సరపడా పాలు పోయాలి. రెండిటిని బాగా కలపగా వచ్చిన గుజ్జుని ముఖానికి పట్టించి 30 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడగడం వలన  ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా మొటిమలు కూడా పోతాయి. అలాగే జిడ్డు బాగా ఉండే చర్మ తత్వం ఉన్న వాళ్ళు పాలకి బదులుగా అరటిపండు గుజ్జులో  రోజ్ వాటర్ ని కలపాలి. ఇలా చేయడం వలన ముఖంపై జిడ్డుని పూర్తిగా నివారిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: