సాధారణంగా ముఖంలో అందంగా కనబడాలంటే కళ్ళు, తర్వాత స్థానం పెదాలకు వెళుతుంది. పెదాలు అందంగా సహజంగా ఉంటే ఆ అందం మరింత గొప్పగా తెలుస్తుంది. అందమైన పెదవులు... అందరి దృష్టిని మనవైపుకు లాగుతాయి. అందమైన పెదాలకి, చక్కని చిరునవ్వు తోడైతే... ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. పెదాల కోసం పుట్టిన అలంకారమే లిప్ స్టిక్. ఇక కొంతమంది అమ్మాయిల దగ్గరకు వెళ్లి.. మీకు నచ్చిన మేకప్ వస్తువు ఏంటి? అనడిగితే.. ఎక్కువ మంది లిప్ స్టిక్‌ అనే చెబుతారు. అయితే ఎంత అందంగా మేక‌ప్ వేసుకొని రెడీ అయిన‌ప్ప‌టికీ.. లిప్ స్టిక్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి ఏదో ఒక మిస్టేక్ చేస్తుంటాం.

 

వాస్త‌వానికి లిప్‌స్టిక్‌ వేసుకోవడానికి కూడా కాసింత కళాపోషణా... కూసింత ఓపికా అవసరమే. ఎంచుకునే రంగూ, వేసుకునే విధానం తెలిసినప్పుడే దాన్ని మనం బాగా ఉపయోగించుకోగలుగుతాం.  మరి మన అదరాలు అదరహో అనాలంటే..లిప్‌స్టిక్‌ ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు మన స్కిన్ టోన్ బట్టి మనకు ఎలాంటి లిప్ స్టిక్ సూటవుతోందో చూసుకోవాలి.పెదవులకు లిప్‌స్టిక్‌తో పాటు లిప్‌లైనర్‌ని తప్పకుండా వాడాలి. లిప్‌స్టిక్‌ వేసుకునే ముందు పెదవులకు మొత్తం లిప్‌లైనర్‌ వేయాలి. 

 

దీనివల్ల లిప్‌స్టిక్‌ ఎక్కువ సమయం ఉంటుంది. పెదవులకు మధ్య ప్రాంతంలో లిప్‌గ్లాస్‌ని వేయాలి. లిప్‌గ్లాస్ పెద‌వుల‌ను క‌ళ‌క‌ళ‌లాడేంచ‌డ‌మే కాకుండా మృదువుగా కూడా ఉండ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రియు దీని వల్ల పెదవులు నిండుగా కూడా కనిపిస్తాయి. ఇక క‌ళ్ల విష‌యానికి వ‌స్తే.. మస్కారాని ఎల్లప్పుడు వాటర్‌ప్రూఫ్‌దే వాడాలి. కింది రెప్పకి వాడకూడదు. మొహానికి సరిగ్గా సమంగా ఉందో లేదో చూసుకుని ఆపై పౌడర్‌ని వేసుకోండి. ఎందుకంటే పౌడర్‌ వేసుకున్నాక అప్పుడు ఫౌండేషన్‌కి సంబంధించిన మార్పులు చేయటం కుదరదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: