సహజంగా ఆడవారికి అందం ఎంత ముఖ్యమో.. దానికి ఎంత ప్రాముఖ్యతనిస్తారో.. శరీర భాగంలో నడుము కూడా అంతే ప్రాముఖ్యతనిస్తారు. అంటే.. వారి నాజుకైన నడుముకు అంతే ప్రాముఖ్యత దక్కుతుంది. అందుకే నడుము మడత అందం గురించి కవులు, రచయితలు రకరకాల పూలు, పక్షులతో పోలుస్తుంటారు. అయితే అందమైన నడుము అనేది ఎప్పుడూ సన్నగా ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. అయితే అందరూ అనుకునేది ఇక్కడ వాస్తవం. ఎందుకంటే నడము వైపుకు రెండు పక్కలా కొవ్వు పేరుకుపోయి లావుగా ఉంటే.. చూసే వారికే కాదు.. మనకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఈ టిప్స్ ను ఫాలో అయ్యి మీ నడుమును నాజూకుగా మార్చుకోండి. 


అయితే కొవ్వు పెరగడానికి మీ ఆహారపు అలవాట్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా చిరు తిళ్లు తినే వారికి, చల్లని కూల్ డ్రింక్స్ తాగేవారికి ఇలాంటి సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. అయితే అందమైన నడుము కావాలంటే... క్రమం తప్పకుండా తేలిక పాటి వ్యాయామం చేయాలంట. మోచేతులు, మోకాళ్ల మీద కూర్చుని, మడిచిన కుడి కాలును వెనక్కి పైకి లేపాలి. ఇదే తరహాలో ఎడమ కాలునూ లేపి దించాలి. ఇలా ఒక్కో కాలుతో 20 రెప్స్, 3 సెట్ల పాటు చేయాలి. 


అలాగే నిటారుగా నిలబడి ఒక కాలును వంచకుండా వీలైనంత మేరకు వెనక్కి చేయాలి. అలాగే రెండో కాలితోనూ వీలైనంత ఎక్కువగా వెనక్కి చేయాలి. ఇలా ఒక్కో కాలితో 20 సార్లు రిపీట్ చేస్తే చేయాలి. ఇలా మొత్తం మూడు సెట్లు చేయాలి. ఇలా మీరు నిరంతరం చేయడం వల్ల మీ కొవ్వు ఆటోమేటిక్ గా కరుగుతుంది. 


ఇంకా.. ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అంతేకాదు ఆడవారి శరీర ఉష్ణోగ్రతను పెంచి కొవ్వును కరిగిస్తుంది. అయితే దీనిని పరిమితంగా తీసుకోవాలి. అలాగే హెర్బల్ టీ తాగడం వల్ల కూడా మీ శరీర బరువుని తగ్గించుకుని మీ నడుము మడతలను పెంచుకోవచ్చు. బాదం పప్పును ప్రతిరోజూ తింటే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. అంతేకాదు మీ శరీర బరువును చాలా మేరకు తగ్గిస్తుంది. బాదంలోని ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్ శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ ని కరిగిస్తాయి. అయితే ఈ బాదం పప్పులను ప్రతిరోజూ మీరు నిద్రించే సమయంలో వాటిని నీటిలో నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం నిద్రలేచి ఫ్రెషప్ తర్వాత బాదం పప్పుపై ఉన్న పొట్టు తీసి తినాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: