చాక్లెట్ చూస్తే ఎవరికైనా ఏం అనిపిస్తుంది ? వెంటనే తినెయ్యాలి అనిపిస్తుంది. అంతేకదా ! నిజమే.. అందరికి తినాలి అనిపించే ఈ మధురమైన చాక్లెట్ తో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఈ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్లు, మెగ్నీషియం ముఖాన్నీ మెరిపించేలా చేస్తాయి. చాక్లెట్‌లో ఉండే యాంటాక్సిడెంట్లు చర్మానికి తగినంత తేమను అందిస్తాయి.. తాజాగా ఉంచుతాయి. 

 

అయితే ఇన్ని లాభాలు ఉన్న ఈ చాక్లెట్‌ను ఎలా ఉపయోగించాలి ? ఈ చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. అందంగా తయారవ్వండి. ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చదవండి. 

 

50 గ్రాముల చాక్లెట్‌ పొడిలో కొన్ని నీళ్లు పోసి చిక్కగా అయ్యేవరకు మరిగించాలి. ఈ మిశ్రమంలో ఆలివ్‌ నూనె, గుడ్డులోని పచ్చసొన వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ పేస్ట్ ని ఫేస్‌కు అప్లయ్‌ చేసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మం నిగనిగలాడుతు మెరిసిపోతుంది. 

 

చాక్లెట్‌ పొడిలో నీళ్లు పోసి మరిగించి అందులో కొద్దిగా ఉప్పు, పాలు పోసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఇందులోని ఉప్పు మృతకణాలను తొలిగిస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే అందంగా కనిపిస్తుంది. 

 

ఈ చాక్లెట్‌ ప్యాక్‌తో మొటిమలు కూడా దూరమవుతాయి. 

 

చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్లు, విటమిన్‌-ఎ, విటమిన్ ఇ సమపాళ్లలో ఉంటాయి. ఈ విటమిన్లు అన్ని వయసుతో పాటు చర్మంపై వచ్చే ముడతలు కనిపించకుండా చేస్తాయి. 

 

వారానికి రెండుసార్లు చాక్లెట్‌ ప్యాక్‌ వేసుకోవడం వల్ల తాజా నిగారింపుతో మెరిసిపోతారు. 

 

ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కాలు వెంటనే పాటించండి.. ఆరోగ్యంగా అందంగా తయారవ్వండి...  

మరింత సమాచారం తెలుసుకోండి: