చుండ్రు ఎప్పుడూ ఉంటుంది కదా ప్రత్యేకంగా చలికాలంలో ఏంటి అని టైటిల్ చదవగానే సందేహం రావచ్చు. ఈ విషయం తెలిసిన వాళ్ళు ఒకే మరి తెలియని వాళ్లకి చెప్పాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చలికాలంలో చికాకు పెట్టించే చుండ్రు గురించి ఒకసారి తెలుసుకుందాం. అన్ని సీజన్ల కంటే కూడా చలికాలంలో చుండ్రు బెడత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే...

 

శీతాకాలంలో తల పొడిగా ఉండటం చాలా అరుదుగా కనిపిస్తుంది. తెమగానే పొడిగా ఉన్నట్టుగా ఉన్నా చల్లని గాలులకి జుట్టు లోపల భాగంలో అంటే మాడు ప్రాంతంలో జుట్టు తెమగానే ఉంటుంది. ఎప్పుడైతే రెమ ఆవరిస్తుందో అప్పుడు చుండ్రు చేరుకోవడానికి మరింత మార్గం మనమిచ్చినట్టే. అలాగే కాలుష్యం జుట్టు భాగంలో పేరుకుపోవడం కూడా చుండ్రుకి ప్రధానమైన కారణం.అంతేకాదు షాంపూ తో తలంటుకున్న తరువాత షాంపూ పూర్తిగా పోకుండా ఉన్నా జుట్టుపై చుండ్రు పేరుకుపోతుంది. మరి ఇలాంటి చుండ్రుకి చెక్ పెట్టాలంటే..

 

తల స్నానం చేసే తప్పుడు శుభ్రంగా చేయాలి, తలపై ఎటువంటి షాంపూ అవశేషాలు లేకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, పీచు పదార్ధాలు, పళ్ళు ఎక్కువగా తీసుకుంటే ఇంకా మంచిది. తలకి తగినంత గాలి, ఎండ తగిలేలా ఉంచుకోవాలి. జుట్టు బలైన రూపు సంతరించుకోవాలి అంటే తప్పకుండా ఎండ తగలాల్సిందే. అలాగే తల స్నానం చేసిన తరువాత రెండు స్పూన్స్ వెనిగర్ ని అదే స్పూన్స్ నీటిలో కలిపి తలకి పట్టిస్తే చుండ్రు పోతుంది.

 

అంతేకాదు పులిసిన పెరుగు, నిమ్మరసం కలిపి తలకి పట్టిస్తే చుండ్రు మళ్ళీ రమ్మన్నా రాదు. మెంతులు చుండ్రుని తరిమి తరిమి కొట్టడంలో కీలకంగా పనిచేస్తాయి కాబట్టి మెంతులు బాగా నానబెట్టి  మెత్తగా రుబ్బుకొని తలకి పట్టించి బాగా ఆరిన తరువాత తల స్నానం చేస్తే చుండ్రు దరిదాపుల్లో చేరదు. ఇలాంటి సహజసిద్ద పద్దతులు పాటించడం వలన జుట్టు బలంగా కూడా మారుతుంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: