ఉంగరాల జుట్టు.. ఈ జుట్టుకు కొంతమందే ప్రియులు ఉంటారు. అది కూడా ఆ జుట్టు లేని వారు ఫీల్ అయ్యి ఆ జుట్టు కావాలి అనుకుంటారు. ఉన్నవాళ్లు ఆ జుట్టుని వద్దు రా బాబు.. ఎలా ఈ ఉంగరాల జుట్టు వదిలిచ్చుకోవాలి అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారు ఇక్కడ ఉన్న చిట్కాలు పాటించి ఉంగరాల జుట్టుకు గుడ్ బై చెప్పండి. 

 

పాలు, కొబ్బరి పాలు, తేనె కలిపి పేస్ట్ లా తయారు చేసి వెంట్రుకలకు పట్టించి గంట తర్వాత తలంటు పోసుకుంటే ఉంగరాల జుట్టు కాస్తా స్ట్రెయిట్ అవుతుంది.

 

పాలు, గుడ్డు కలిపి వెంట్రుకలకు పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి తలస్నానం చెయ్యాలి. అంతే జుట్టు స్ట్రెయిట్ అవుతుంది. 

 

పాలను స్ర్పే బాటిల్‌లో నింపి కుదుళ్ల నుంచి చివరి వరకూ వెంట్రుకలను స్ప్రే చేయాలి. అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

 

తలకు గోరువెచ్చని నూనెతో మసాజ్‌ చేసి వేడి నీళ్లలో ముంచి పిండిన టవల్‌ చుట్టాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. అంతే.. ఈ చిట్కాతో జుట్టు స్ట్రెయిట్ అవుతుంది. 

 

అలోవేరా గుజ్జుకు రోజ్‌మేరీ, శాండిల్‌వుడ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కలిపి పేస్ట్‌లా తయారుచేసి కుదుళ్లకు పట్టించాలి. రెండు గంటలాగి తలస్నానం చేయాలి.

 

అరటి గుజ్జు, తేనె, పెరుగు, ఆలివ్‌ ఆయిల్‌లను కలుపుకుని 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి.... అంతే ఉంగరాల జుట్టు పోయి స్ట్రైట్ హెయిర్ వచ్చేస్తుంది. 

 

చూశారుగా... ఇక్కడ ఉన్న చిట్కాలను. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చికాకు పుట్టించే ఉంగరాల జుట్టుకు గుడ్ బై చెప్పండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: