ఫేస్ మాస్కు ఎప్పుడు వేసుకుంటారు ? అందంగా కనిపించాలనుకున్నప్పుడు వేసుకుంటారు.. బయటకు వెళ్లేప్పుడు వేస్తారు.. మరి ముఖ్యంగా పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లేముందు వేసుకుంటారు. అయితే ఇలా వేసుకోడానికి కారణం అందం.. అయితే ఆరోగ్యం కూడా వస్తుంది కొన్ని ఫేస్ మాస్కులతో. అది ఎలా అంటే ?

 

పండ్లతో, పాలతో, ఆకుకూరలతో పాటు తేనె, ఓట్స్‌, చార్‌కోల్‌ వంటి వాటితో కూడా ఫేస్‌ప్యాక్స్‌ తయారు చేసుకుని వేసుకోవచ్చు. అయితే ఆ ఫేస్ మాస్కు ఎలా చెయ్యాలి ఎలా వేసుకోవాలి అనేది ఇక్కడ చదవండి. రోజ్‌మేరీ వంటి ఆయిల్స్‌తో మాస్క్‌లు వేసుకుంటే అవి సహజంగానే చర్మానికుండే తాజాదనాన్ని కూడా తీసుకువస్తాయి. 

 

అయితే ఓట్స్‌, తేనె, చార్‌కోల్‌లతో ఉండే మాస్క్‌లు చర్మంపై చాలా ప్రభావం చూపుతాయి. ఇవి చర్మంపై ఉన్న మృతకణాలను తొలిగిస్తాయి. మొటిమలు ఎక్కువగా ఉన్నవారికి ఈ మాస్క్‌లు బాగా పనిచేస్తాయి. అయితే తేనెతో చేసిన మాస్క్‌లు రక్తప్రసరణ సరిగా జరిగేలా చేయడంతో పాటు సహజంగానే చర్మం యవ్వనంతో మెరిసేలా చేస్తాయి. 

 

అంతేకాదు ఒక మంచి డీప్ క్లినింగ్ ఫేస్ మాస్క్‌ చర్మంపైన ఉన్న జిడ్డును, కంటికి కనిపించని మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. అలాగే వాయు కాలుష్యంతో చర్మంపై ఏర్పడిన మచ్చలను పోగొట్టి, వెంటనే కాంతివంతం చేస్తుంది. చూశారుగా ఈ చిట్కాలు. ఇంకెందుకు ఆలస్యం మీ చర్మాన్ని ఈ ఫేస్ మాస్కుతో అందంగా తయారు చేసుకొండి.. అందమే కాదు ఆరోగ్యం కూడా సొంతం చేసుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: