సాధార‌ణంగా కాకర కాయను చూస్తేనే చిన్నా.. పెద్దా అందరికీ చిరాకే. చేదుగా ఉంటుందని దీన్ని తినడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు, సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మాత్రం కష్టమైనా, ఇష్టంలేకపోయినా ఉప‌యోగిస్తారు. ఇక అందం.. ఆరోగ్యం.. ఈ రెండు ఎవ‌రు కోరుకోరు చెప్పండి.  అయితే కాక‌ర‌తో ఈ రెండూ పొంద‌వ‌చ్చు. కాకరకాయను తరచుగా తీసుకోవడం వల్ల రక్తపోటు, హైబీపీ, అలర్జీలు దూరం చేసుకోవచ్చు. అలాగే అందరినీ బెంబేలెత్తించే.. చాలామంది బాధపడుతున్న డయాబెటిస్ కి చెక్ పెట్టవచ్చు.

 

ఇక సౌంద‌ర్య విష‌యానికి వ‌స్తే.. కాకరని ఉపయోగించి ఎంతో అందంగా తయారవ్వొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆరోగ్యాన్నిచ్చే కాకరలో అందానికి పనికొచ్చే ఎన్నో గుణాలు ఉన్నాయని చెబుతున్నారు.  కాకర కాయని రసంలా చేసి.. ఈ రసాన్ని ముఖానికి రాయాలి. ప‌ది నిమిషాలు అలానే ఉంచి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడిగాలి. ఇలా రోజుకి ఓ సారి చేయడం వల్ల ముఖం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. దీంతో ముఖం తాజాగా మార‌డ‌మే గాక.. ఎలాంటి మచ్చలు ఉన్నా చాలా వరకూ దూరం అవుతాయి.

 

అలాగే కాకరకాయ పేస్ట్‌లో కరివేపాకు పొడి వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మొటిమల సమస్య చాలా వరకూ తగ్గుతుంది. మ‌రియు కాకరకాయ సగం ముక్కని తీసుకుని పేస్ట్‌లా చేయాలి. ఇందులో జాజికాయ పొడి, పెరుగు కలిపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని క్లీన్ చేయాలి. ఇలా వరుసగా కొన్ని రోజులు చేస్తుంటే.. మొటిమలు, మచ్చల సమస్య పూర్తిగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: