నిమ్మకాయ.. రోజుకు ఒక నిమ్మకాయ రసం తీసుకుంటే లావు లేకుండా సన్నగా ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్లు చెప్తుంటారు. అలానే అందానికి కూడా నిమ్మకాయ ఎంతో ఉపయోగ పడుతుంది అని.. అందానికి సహాయపడేవాటిలో నిమ్మకాయ పాత్ర ఎంతో ఉంది అని కొందరు చెప్తున్నారు. అయితే ఆ నిమ్మకాయని అందం కోసం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

30 ఏళ్ళు దాటాక మచ్చలతో పాటు నల్లమచ్చలు, టానింగ్‌, చర్మం కాంతి విహీనం కావడం, చర్మం మీద ఏర్పడే ఇతర మచ్చలను నిమ్మరసం పూర్తిగా పోగొడుతుంది.

 

పొడిబారిన చర్మంపై, మృతకణాలున్న పెదాలపై నిమ్మరసం రాస్తే చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. 

 

రాత్రి నిద్ర పోయే ముందు పెదాలకు నిమ్మరసం రాసుకుని పడుకుంటే పేదలు అందంగా ఆరోగ్యంగా తయారవుతాయి. 

 

మోకాళ్లు, మోచేతుల దగ్గర నల్లగా ఉన్న చర్మంపై సగం నిమ్మచెక్కతో బాగా రుద్దితే, చర్మం రంగులో మార్పు కనిపిస్తుంది.

 

న్యాచురల్ ఆయిల్స్‌లో నిమ్మరసం వేసి బాగా కలిపి రాసుకుంటే మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చర్మం మృదువుగా, పట్టులా మారుతుంది. 

 

కొబ్బరినీళ్లు లేదా ఆలివ్‌ ఆయిల్‌లో రెండుమూడు నిమ్మరసం చుక్కలు వేసి రాసుకున్న చర్మం మృదువుగా తయారవుతుంది.

 

నిమ్మరసంలో కొద్దిగా వంటసోడా వేసి దంతాలు తోముకుంటే దంతాలు తళ తళలాడతాయి. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ పళ్ళను.. చర్మాన్ని ఆరోగ్యంగా అందంగా కాపాడుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: