మెడ.. ఎంత జాగ్రత్తలు తీసుకున్న సరే.. నల్లగానే ఉంటుంది. ఈ మెడకు ఎలాంటి జాగ్రత్త తీసుకున్న సరే.. నల్లగానే ఉంటుంది. అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ముఖంతో పాటు మెడకు కూడా సన్‌స్ర్కీన్‌ రాసుకోండి. సన్‌స్ర్కీన్‌ వాడడం వల్ల చర్మం మీద ముడతలు, గీతలు ఏర్పడవు దీంతో చర్మం యవ్వనంగా తయారవుతుంది. 

 

స్నానం చేసిన తరువాత మెడకూ మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా చేస్తే మెడ భాగంలోని చర్మానికి పోషణ, తేమ అందుతుంది.

 

ముఖ సౌందర్యానికి ఎలా ఫేస్‌మాస్క్‌ వాడుతారో అలాగే మెడకు కూడా నెక్‌ ప్యాచెస్‌ వేసుకోవాలి. ఈ ప్యాచెస్‌ మెడ మీది గీతల్ని, ముడతల్ని తగ్గించి చర్మానికి తాజాదనాన్ని అందిస్తాయి. 

 

మేకప్ వేసుకునే సమయంలోనే మీద భాగంపై ద్రుష్టి పెట్టి గీతాలు.. మచ్చలు కనపడకుండా జాగ్రత్త పడండి. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని అందంగా మార్చుకోండి.. మెడ కూడా మెరిసేలా చేసుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: