ముఖంతో పాటు జుట్టుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు మహిళలు. కొందరు జుట్టే తమ స్టేటస్ సింబల్, స్టైలిష్ ఐకాన్ అన్న ఆలోచనలో కూడా ఉంటుంటారు. పొడవైన, ఆరోగ్యవంతమైన జుట్టు అందానికి ప్రతీక. అయితే నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లు, తరచూ వాడే షాంపూలు, రంగుల వినియోగం వంటి కారణాల మూలంగా జుట్టు సహజ శోభను కోల్పోయి నిర్జీవంగా మారుతోంది. వీటితో పాటు మ‌నం చేసే కొన్ని పొర‌పాటుల వ‌ల్ల కూడా జుట్టు స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

 

ముఖ్యంగా త‌ల‌స్నానం త‌ర్వాత ఈ ప‌నులు చేయ‌డం వ‌ల్ల అధిక జ‌ట్టు ఊడిపోవ‌డానికి కార‌ణం అవుతుంది. అవేంటంటే.. తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టును బాగా రుద్దడమనేది, బ్యాడ్ ఐడియా. ఇది మీ జుట్టుకు తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించగలదు. మీ తడి జుట్టును గట్టిగా రుద్దడం మూలంగా మీ జుట్టు రఫ్ గా మారి, క్రమంగా జుట్టు విరిగిపోవడానికి దారితీస్తుంది. తలస్నానం తర్వాత జుట్టును ఎండబెట్టడానికి టవల్‌ను ఉపయోగించడం కారణంగా జుట్టు ఎక్కువటగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది.

 

జుట్టు పొడిబారడం, పెళుసుగా తయారయ్యేందుకు ఇది కారణమవుతుంది. జుట్టుచివరలు చిట్లడం వంటి అవకాశాలను కూడా పెంచుతుంది. ఎప్పుడూ తడి జుట్టును దువ్వకూడదు. మీ తడి జుట్టును దువ్వెనతో దువ్వినప్పుడు, అది తీవ్ర రాపిడి మరియు ఒత్తిళ్లకులోనై జుట్టు పెళుసుగా మారడానికి కారణమవుతుంది. కొందరు తడి జుట్టును పొడిగా చేయడానికి బ్లో- హెయిర్ డ్రయర్ వాడుతుంటారు. దీని కారణంగా జట్టు మీద ఉండే తేమ తగ్గిపోతుంది. మరియు తడి జుట్టును ముడివేయడం మూలంగా తలలో చుండ్రు, దురద, తలలో పేలు మొదలగు సమస్యలు

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: