సాధార‌ణంగా కొందరి శరీరంలో కొన్ని అవలక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలన్నీ అనారోగ్యానికి చెందినవి కాకపోవచ్చు. వీటిలో ముఖంపై ముడుతలు, అవాంచిత రోమాలు లాంటి స‌మ‌స్య‌ల‌కు ఎక్కువ‌గా బాధ‌ప‌డుతుంటాయి. ముఖ్యంగా ముఖంపై అవాంచిత రోమాలు తొలగించుకోవడానికి మనం తరచుగా పార్లర్లకి వెళ్తాం. త్రెడింగ్, వాక్సింగ్ మరియు షేవింగ్ వంటి అనేక విధానాలను అనుసరిస్తూ ఉంటారు. కానీ.. చిన్న చిన్న సమస్యలను మనం ఇంట్లోనే తగ్గించుకోవచ్చు.

 

దీనికోసం ముందుగా కొద్దిగా పెరుగును తీసుకొని, శనగ పిండి మరియు పసుపును కలిపి ఒక చిక్కటి పేస్ట్ గా మారే వరకు బాగా కలపండి. ఈ పేస్ట్ ను అవాంచిత రోమాల‌పై పూసి, పావుగంట పాటూ వేచి ఉండండి. ఇది పూర్తి పొడిగా మారిన తరువాత తొలగించి, నీటితో కడిగితే ఖ‌చ్చితంగా మార్పు క‌నిపిస్తుంది. గోధుమపిండి, పసుపు సమానంగా తీసుకుని అందులో సెసమ్ ఆయిల్ వేసి కలిపి ముఖానికి పట్టిస్తే కనుబొమ్మల మధ్య, గడ్డం, చెంపల మీద, పెదవుల మీద ఉన్న వెంట్రుకలు రాలిపోతాయి.

 

అలాగే చక్కర, నిమ్మకాయని నీటిలో కలిపి పేస్ట్ గా తయారు చేయండి.ఈ పేస్ట్‌ను ముఖంపై వెంట్రుకల అప్లే చేయాలి. ఇక పావు గంట త‌ర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా ఫ‌లితం ఉంటుంది. మ‌రియు పంచదార, తేనె మరియు నిమ్మ మిశ్రమం క‌లిపి అవాంచిత రోమాల‌పైన అప్లే చేయాలి. పావు గంట త‌ర్వాత దాన్ని తొలిగించి క్లీన్ చేసుకోవాలి. ఇది జుట్టును సమర్థవంతంగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. చక్కెర కూడా మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంలో ఉత్తమంగా సహాయం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: