బంగాళాదుంపతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ బంగాళా దుంప టేస్ట్ కోసం.. మాత్రమే కాదు.. ఆరోగ్యానికి.. అందానికి కూడా ఈ బంగాళా దుంప ఎంతో సహాయం చేస్తుంది. అయితే ఈ బంగాళాదుంపతో అందానికి ఉపయోగ పడే ప్రయోజనాలు ఏమి ఉంటాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

1. బంగాళాదుంప గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించుకోవాలి.. 10 నిమిషాల తర్వాత కడిగేస్తే కమిలిన చర్మం కాంతివంతంగా తయారవుతుంది. 

 

2. బంగాళాదుంప గుజ్జులో కొద్దిగా పెరుగు కలిపి పేస్ మాస్క్ ల వేసుకోవాలి.. 15నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముడుతలతో పాటు ఏజింగ్ లక్షణాలు కూడా తొలగిపోతాయి.

 

3. బంగాళాదుంపను పేస్ట్ ల చేసి అందులో ముల్తానీ మట్టి, నిమ్మరసం కలిపి ఆ పేస్టుని ముఖానికి పట్టించుకొని అరగంట తరవాత కడిగేస్తే చర్మం మృదువు అవడంతో పాటు, ఛాయ కూడా పెరుగుతుంది.

 

4. బంగాళాదుంప రసంలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం మారుతుంది. 

 

5. కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, కళ్లు ఉబ్బడం వంటివి తగ్గాలంటే బంగాళాదుంప జ్యూస్ లో ముంచి కాటన్ బాల్స్ ని కళ్లపై పావుగంట సేపు ఉంచుకుంటే నల్లని వలయాలు తగ్గుతాయి

 

6. బంగాళాదుంపను పేస్ట్ ల చేసి అందులో తేనె మిక్స్ చేసి కంటి చుట్టూ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ చాలా ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి.

 

7. మచ్చలపై బంగాళాదుంప పొట్టుని పెడితే మంచి ఫలితం ఉంటుంది. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని కాపాడుకోండి. అందంగా తయారవ్వండి. బంగాళాదుంపతో బంగారం గ్లో తెచ్చుకొండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: