అందంగా క‌నిపించ‌డానికి ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కాని.. ఫ‌లితం లేక బాధ‌ప‌డుతుంటారు. అయితే ఆలివ్ ఆయిల్‌ తో చాలా ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యంతో పాటు అందాన్నిచ్చే ఆలివ్ ఆయిల్ ని తరుచూ ఉపయోగిస్తే చాలా మంచిది. నూనెలన్నిట్లో మేలురకం వంటనూనె 'ఆలివ్‌ ఆయిల్‌’. పోషకాలపరంగా, ఉపయోగాలు, నిల్వపరంగా ఆలివ్‌ నూనె ఉత్తమమైనది. అయితే ఆలివ్ ఆయిల్ ను స్నానం చేసే ముందు బాడీకి పూసుకుంటే చర్మానికి చాలా మంచిది. చలికాలంలో స్కిన్ పగిలిపోతూ ఉంటుంది.

 

అంతేనా అంటే కాదండోయ్‌.. ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. కొందరికి చర్మం గరుకుగా ఉంటుంది. అలాంటి వారు ఆలివ్ ఆయిల్ లో కాస్త షుగర్ కలిసి అది కరిగిపోయిన తర్వాత ఆ ఆయిల్ తో బాడీ మొత్తం మసాజ్ చేసుకోండి. దీంతో చర్మం మొత్తం కూడా స్మూత్ గా మారిపోతుంది. బాదం, ఆలివ్ ఆయిల్ తో ఫెయిర్ స్కిన్ సొంతం అవుతుంది. ఆలివ్ ఆయిల్ చాలా మంది ఉపయోగిస్తారు. అయితే ఈ రెండు నూనెలు కూడా మిక్స్ చేసి బాడీ మసాజ్ కు ఉపయోగిస్తారు.

 

వెంట్రుకలు నిగనిగలాడాలంటే ఆలివ్ ఆయిలో కాస్త గుడ్డు సోన కలిపి దాన్ని బాగా మిక్స్ చేసి వెంట్రుకలకు పూసుకోవాలి. రెగ్యులర్ గా ఇలా చేస్తే మీ హెయిర్ మొత్తం పట్టులా మారుతుంది. అదే విధంగా నిమ్మరసంలో కాస్త ఆలివ్ ఆయిల్ ను కలుపుకుని హెయిర్ కు అప్లై చేయాండి. తర్వాత హెడ్ బాత్ చేయండి. అలా రెగ్యులర్ గా చేస్తే జుట్టు మొత్తం కూడా నిగనిగలాడిపోతుంది. అలాగే కొందరికి సబ్బుతో రుద్దుకుంటే తెల్లగా మారిపోతూ ఉంటుంది. అలాంటి వారు స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ ను ఒంటికి రాసుకుని తర్వాత స్నానం చేస్తే తెల్లగా మారదు.

 
 
 
 
   

మరింత సమాచారం తెలుసుకోండి: