ఆముదం.. ఈ నూనె గురించి ఎవరికి తెలియదు అండి.. ప్రతి ఒక్కరికి ఈ ఆముదం గురించి తెలిసే ఉంటుంది. ఎందుకు అంటే ఆముదంను మనం దేవుడిని పూజించటానికి ఉపయోగిస్తాం. అందుకే మనకు ఆముదం గురించి అందరికి తెలుసు. అయితే ఆముదంను పూజకు ఏ కాదు జుట్టుకు వాడిన ఎంతో మంచిది. 

 

ఎలా అంటారా? అదేనండి.. ఆముదంను మన తలకు పట్టించుకుంటే జుట్టు రాలడం.. చుండ్రు విముక్తి అవ్వడం ఖాయం అంట.. అయితే ఈ చుండ్రు చాల జిడ్డుది.. ఎంత జిడ్డు అంటే.. ఎన్ని షాంపూలు వాడిన పోదు.. కానీ ఆముదం వాడితే పోతుంది అని అంటున్నారు కొందరు వైద్య నిపుణులు. 

 

అయితే ఆముదం ఎలా వాడితే జుట్టు రాలడం.. చుండ్ర పోవడం జరుగుతాయో ఇక్కడ చదివి తెలుసుకోండి. జుట్టు రాలడం తగ్గాలి అంటే.. ఆముదంలో రెండు నుంచి మూడు చెంచాల అల్లం రసం కలిపి వెంట్రుకల కుదుళ్లకు పట్టించాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. 

 

ఇంకా చుండ్రు పోవాలంటే.. ఆముదంలో రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జు, మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ కలిపి తలకు పట్టించుకొని 45 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు మాయం అవుతుంది. ఇంకా జుట్టు పెరగాలి అంటే.. ఆముదం, బాదం నూనెలను సమపాళ్లలో తీసుకుని వేడి చేసి అందుకో మూడు చుక్కల రోజ్‌మేరీ ఆయిల్‌ కలిపి కుదుళ్లకు పట్టించుకోవాలి. ఇలా చేసిన తర్వాత తలస్నానం చేయాలి. చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ జుట్టుని ఆరోగ్యంగా మార్చుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: