మన శరీరంలో అన్నింటి కన్నా చర్మం నల్లగా ఏం ఉంటుంది అంటే వెంటనే చెప్పాయచ్చు మన మోచేతులు అని. అక్కడ చర్మం ఎక్కువ ఉండటం వల్ల చర్మం అంత ఒకేచోటుకు చేరడం వల్ల మోచేతులు మోకాళ్ళు నల్లగా కనిపిస్తాయి. అయితే ఆ మోచేతులు తెల్లగా అవ్వాలి అంటే కొన్ని చిట్కాలు తప్పక పాటించాలి. అప్పుడే అందంగా.. మోచేతులు.. మోకాళ్ళు కూడా మెరుస్తాయి. అయితే అలాంటి చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. అందంగా తయారవ్వండి.. 

 

నిమ్మకాయతో చెక్కల్లో అరచెంచా ఉప్పు, అరచెంచా చక్కెర వేసి మోచేతులు, మోకాళ్ల దగ్గరున్న చర్మంపై బాగా రుద్ది తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. నిమ్మకాయ చెక్కలో చక్కెర, ఉప్పును వాడడం వల్ల శరీరంపై ఉన్న మృత చర్మం ఊడిపోయి శక్తినిస్తుంది.

 

బొప్పాయి పేస్టుతో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోండి.. ఎలా అని మీకు సందేహం రావచ్చు.. ఈ బొప్పాయిలో చర్మాన్ని శుభ్రం చేసే గుణం ఉంది.. అంతేకాదు ఈ బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. కాబట్టి బొప్పాయి గుజ్జులో పెరుగు వేసి పేస్ట్ ల చేసి దాన్ని చర్మాన్ని శుభ్రం చేసుకోండి. ఆ పేస్టు వల్ల మోచేతులు నల్లదనం తగ్గుతుంది. 

 

ఆలివ్‌ ఆయిల్‌లో యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇవి నల్లగా ఉన్న చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. కాబట్టి ఆలివ్ ఆయిల్ ని క్రమం తప్పకుండా వాడండి.. చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని అందంగా తయారు చేసుకోండి.. కాంతిని పెంచుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: