కాస్టర్ ఆయిల్ అనేది స్టికీగా ఉండే ఒక చమురు, ఇది ఆరోగ్యానికి మరియు సౌందర్యానికి సంబంధించిన అనేక చికిత్సలకు ఉపయోగిస్తారు. అలాగే క్యాస్టర్ ఆయిల్ సహజంగా ఫాటీ ఆసిడ్ లతో నిర్మితమై, రిసినోయిక్ ఆసిడ్ లను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. అంతేకాకుండా, విటమిన్ 'E', ప్రోటీన్, మినరల్ మరియు యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇవి చర్మాన్ని అందంగా మారుస్తాయి. తరచూ క్యాస్టర్ ఆయిల్ ను స్కిన్ కేర్ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

 

చర్మం పొడిబారడం, పింపుల్స్ లాంటి అనేక చర్మ సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది. అందుకు ముందుగా క్యాస్టర్ ఆయిల్, అలోవెరా జెల్ ను క‌లిపి ఫ్రీజ‌ర్‌లో పెట్టి సాలిడ్‌గా మారాక దాన్ని కంటి కింద సున్నితంగా మ‌సాజ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల డార్క్ సర్కిల్స్ సమస్య త‌గ్గుతుంది. వయస్సు వలన కలిగే మచ్చలకు ఉత్తమమైన పరిహారం కాస్టర్ ఆయిల్. మీ మచ్చల మీద ఆముదాన్ని రాసి సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ల‌భిస్తుంది.

 

రాత్రి పడుకునే ముందు పాదాల పగుళ్లపై వేడి చేసిన కాస్టర్ నూనెని రాసి ఉదయాన్నే వేడి నీటితో కడగండి. ఇది పగుళ్ల వలన కలిగే నొప్పిని తొలగిస్తుంది మరియు క్రమంగా వాడటం వలన పగుళ్లను కూడా తొలగిస్తుంది. కాస్టర్ నూనెతో బేకింగ్ సోడాని కలుపుకొని మొటిమ‌ల‌పై అప్లే చేయాలి. ఇలా క్రమంగా చేయటం వల్ల మొటిమ‌లు, వాటి వ‌ల్ల వ‌చ్చే మచ్చలు తొలగిపోతాయి.  స్ట్రెచ్ మార్క్స్‌పై ఆముదం నూనెని ఒక నెల పాటు వాడటం వల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: