సాధార‌ణంగా ఎవరైనా పొడుగు జుట్టున్న అమ్మాయిలు కనిపిస్తే.. వీళ్లు జుట్టుకు ఏం రాసుకుంటున్నారో గానీ.. నాక్కూడా జుట్టు అలాగే పెరిగితే బాగుండు అనుకోకుండా ఉండలేం. వాస్త‌వానికి అమ్మాయిలకు జుట్టు పొడవుగా ఉంటే చాలా అందంగా కనిపిస్తారు. జుట్టు పొడవుగా ఉండే అమ్మాయింటే అబ్బాయి ఎక్కువగా ఇష్టపడుతారని కూడా అంటుంటారు. కాని, మ‌నం ఎన్నో జుట్టు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటాం. అందులో ముఖ్యంగా వింటర్ సీజన్ లో మరింత ఎక్కువగా జుట్టు రాలే సమస్య ఉంటుంది. చలికాలంలో జుట్టు రాలే సమస్యను ఎదుర్కోవడానికి కొన్ని రెమెడీస్ ను ఉన్నాయి. 

 

అందులో అల్లం ఒక‌టి. అవును! కేశ సంరక్షణ కొరకు అల్లం ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు మరియు మెగ్నీషియం, పొటాషియం మరియు కాపర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నందున, ఇది జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. అందుకు ముందుగా గిన్నె తీసుకుని అందులో అల్లం తరుగు వేయండి. దీనికి కొబ్బరినూనె చేర్చి బాగా కలపండి ఒక ఐదునిమిషాలు ఆగి, జుట్టును పాయలుగా విడదీస్తూ, మొత్తం అంతటికీ శుభ్రంగా పట్టేలా ఈ మిశ్రమాన్ని రాసుకుని, అయిదు నిమిషాలు పాటు మర్దన చేసుకోండి.

 

కాసేప‌టి త‌ర్వాత త‌లస్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అల్లం సహజమైన కండీషనర్ గా పనిచేసి జుట్టు తెగిపోవడాన్ని అరికడుతుంది. అలాగే అల్లంలో ఉండే యాంటీమోక్రోబియల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో సహాయపడటమే కాక జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అల్లంలో ఉండే  జింజెరాల్ రక్తనాళాలను విశ్రాంతపరచి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇది కేశాలకు అవసరమైన పోషణను అందించి జుట్టును పెరిగేట్టు చేస్తుంది. సో.. ఈ టిప్స్ ఖ‌చ్చితంగా ఫాలో అవ్వండి.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: