స్త్రీ, పురుషులిద్దరిలో కనిపించే ఒక కామన్ ప్రాబ్లెమ్ కాళ్ళ పగుళ్లు. పాదాల పగుళ్లు ఏర్పడినప్పుడు పాదాల చుట్టు చీలినట్లు, చర్మం పైకి పీక్కుపోయినట్లుగా చాలా ఇబ్బందికరంగా కనబడుతుంటుంది. హీల్ వద్ద మరింత ఎక్కువగా ఉంటుంది. అలా పాదాలు పగుళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలు నివారించుకోవచ్చు. ఒక  టబ్‌లో కొంచెం నీళ్లు తీసుకోండి. దానిలో గ్లిసరాల్‌ మరియు రోజ్‌వాటర్‌ను కలపండి. దానిలో కొన్ని నిముషాలపాటు ఉంచితే పాదాలు మృదువుగా తయారవుతాయి.

 

ఒక కాటన్ బాల్ సహాయంతో ఆలివ్ ఆయిల్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై అచ్చేసి సర్క్యూలర్ మోషన్ లో పది నుంచి పదిహేను నిమిషాల వరకు మసాజ్ చేయాలి. ఇప్పుడు ఒక జత దట్టమైన కాటన్ సాక్స్ ను ధరించి గంట పాటు అలాగే ఉండాలి. ఈ పద్దతిని కొన్ని వారాల పాటు ప్రతిరోజూ మంచి ఫ‌లితం ఉంటుంది. నువ్వుల నూనె, శనగ నూనె, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, కొబ్బరి నూనె... ఇలా ఎలాంటి వంటనూనెనైనా పాదాలకు ఉపయోగించవచ్చు. ప‌డ‌కునే ముందు వీటిలో ఏ నూనైనా పాదాల‌కు అప్లై చేసి ప‌డ‌కుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

 

కొంచెం బేకింగ్ సోడాని గోరు వెచ్చని నీటీతో కలిపి ఒక అర గంట పాటు కాళ్లని నీటిలో ఉంచి, తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరికాళ్ళ పగుళ్ళనుండి ఉపశమనం లభిస్తుంది అంటున్నారు నిపుణులు. ఒక టబ్‌లో గోరు వెచ్చని నీటిని పోయాలి. దానిలో ఉప్పు మరియు వ్యాసిలిన్‌ను వేసి ఒక అర్ధగంట మీ పాదాలను టబ్‌లో ఉంచాలి. అలా చేసిన తరువాత అగ్నిశిల రాళ్లు లేదా బ్రష్‌తో మీ పాదాలకు మర్దన చేయాలి.అపుడు మీ పాదాలు మృదువుగా మారతాయి. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: