తెల్లని ముఖ సౌందర్యాన్ని నల్లని బ్లాక్ హెడ్స్ చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి. ఇవంటే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా భ‌య‌ప‌డ‌తారు. వాస్త‌వానికి మన చర్మం క్రింద సెబాసియస్ గ్లాండ్స్ ఉంటాయి. యుక్త వయస్సులో ఈ గ్లాండ్స్ చురుకుగా పనిచేస్తాయి. సెబమ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల చర్మం పై ఎర్రగా లేదా నల్లగా ఉండే పింపుల్స్ ఏర్పడతాయి. నల్లగా ఉండే పింపుల్స్ ను బ్లాక్ హెడ్స్ అంటారు. ఇవి మామూలు పింపుల్స్ కన్నా పెద్దగా ఉంటాయి.

 

అయితే కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా వీటిని ఈజీగా తొలగించవచ్చు. ఓట్స్ పొడిలో పెరుగు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలిపి ప్యాక్ వేసుకుని బాగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది.  తేనెను, ఎగ్‌వైట్‌ను క‌లిపి ఆ మిశ్రమాన్ని ముఖం మీదే అప్లై చేయాలి. అది బాగా ఆరిపోయిన తర్వాత గోరు వెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఒక‌టి, రెండు సార్లు చేయడం వ‌ల్ల  శాశ్వతంగా బ్లాక్ హెడ్స్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి ముఖానికి పూసుకోవాలి. ఆరిన‌ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రెండు రోజుల‌కు ఒక‌సారి ఇలా చేయ‌డం వ‌ల్ల‌ బ్లాక్ హెడ్స్ బెడద తీరిపోతుంది. అలోవెరా మొక్క నుంచి తాజా జెల్ను సేకరించి మీ ముఖానికంతటికీ ప్యాక్‌లా అప్లై చేయండి. ఒక పావు గంట  తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ను రోజువారీగా అప్లై వల్ల పెద్దగా తెరచి ఉన్న చర్మ రంధ్రాలను మూసి వేసి, బిగుతైన సున్నితమైన చర్మాన్ని కలిగి ఉండేలా చేస్తుంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: