ప్రతిరోజూ రెండు సార్లు ఒక్కొక్కసారి అయిదేసి నిమిషాల చొప్పున దంతాలు శుభ్రం చేయటమంటే బోర్ గా భావిస్తారు. కాని దంత శుభ్రత ఎంతో ప్రధానమైంది. మరి ప్రతి రోజూ రెండు సార్లు నోటిని దంతాలతో సహా శుభ్రం చేయాల్సిందే. ఇక కొందరికి పళ్ల వరస బాగా ఉన్నా దంతాలు మాత్రం పసుపు పచ్చ రంగులో ఉంటాయి. అలాంటివారు నలుగురిలో నవ్వడానికి ఇబ్బందిపడతారు. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు.

 

అయితే స‌హ‌జంగానే ఈ స‌మ‌స్య‌ను ఎలా తొలిగించుకోవాలో తెలుసుకుందాం. నిమ్మలో సహజ బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి, ఇంకా నిమ్మ తొక్క గ్రేట్‌గా మీ పళ్ళను శుభ్రపర్చగలదు. నిమ్మతొక్కను నేరుగా మీ పళ్ళపై రుద్దుకుని తర్వాత నోటిని నీరుతో కడుక్కుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. జున్ను ముక్కలు కూడా ఉపయోగించి సహజంగా దంతాలను శుభ్రం చేయవచ్చు. దీనిలో వుండే యాసిడ్లు పళ్ళ సందులలో ఇరుక్కున్న ఆహారాలను సైతం తొలగిస్తాయి. నోటిలోని పి హెచ్ బ్యాలన్స్ నిలుపుతాయి. జున్ను ఎపుడు తిన్నా మీరు నోటిలో కొంత లాలాజలాన్ని ఊరించి తినండి. 

 

ఈ లాలాజలం జున్నుకు రుచి కల్పించటమే కాదు, నోటి శుభ్రతకు బాగా ఉపయోగిస్తుంది. మీకు స్ట్రాబెర్రీలు తినటం ఇష్టం అయితే, మీకో మంచివార్త. స్ట్రాబెర్రీలను తినడం లేదా పళ్ళపై రుద్దుకోవడం మీ పళ్ళను సహజంగా తెల్లగా మారేలా చేస్తుంది. మ‌రియు కొబ్బరినూనె నిజానికి మీ పళ్ళను శుభ్రపర్చగలదు. ఒక చెంచాడు కొబ్బరినూనెను మీ నోట్లోకి వేసుకుని ఐదు నిమిషాల పాటు పుక్కిలిపట్టండి. లేదా టూత్ బ్రష్ పై కొన్ని చుక్కల కొబ్బరినూనెను వేసుకుని దానితో పళ్ళను ఐదు నిమిషాల పాటు బ్రష్ చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

  
 

మరింత సమాచారం తెలుసుకోండి: