అవును.. మనం ఇన్నాళ్లు ఆలూని చిప్స్ లా తిన్నాం.. ఫింగర్ చిప్స్ లా తిన్నాం.. ఆలూ కర్రీ.. ఆలూ ఫ్రై ఇలా ఎన్నో రకాల అద్భుతమైన వంటకాలను తిన్నాం.. అయితే అలాంటి ఈ ఆలుతో అందాన్ని ఇలా మీ సొంతం చేసుకోండి.. బంగాళాదుంపతో సహజసిద్ధంగా అందం ఎలా మీ సొంతం చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

వారానికోసారి తేనెతో ముఖం, మెడ, చేతుల్ని మర్దన చేసుకుంటే ముఖం తాజాగా మెరిసిపోతుంది. 

 

అరచెంచా గులాబీనీళ్లలో 4 చుక్కల నిమ్మరసం, 2 చెంచాల గ్లిజరిన్‌ కలిపి అందులో దూది ఉండలు వేసి ముఖాన్ని తుడుచుకోవాలి. కాసేపు అయ్యాక కడిగేసుకుంటే చర్మం శుభ్రపడుతుంది.. అందంగా తయారవుతుంది. 

 

బంగాళాదుంపని మెత్తగా మిశ్రమంలా చేసి.. అందులో వచ్చిన గుజ్జులో రసం తీసి ముఖానికి పాటించాలి. ఇలా కాసేపు అయ్యాక కడిగేయాలి. ఈ రసంలో ఉండే విటమిన్‌ సి చర్మంపై నలుపును దూరం చేసి కాంతివంతంగా తయారు చేస్తుంది.

 

పండిన అరటిపండు గుజ్జు రెండు చెంచాలు, చెంచా చొప్పున గులాబీ నీళ్లు, తేనె, పెరుగు తీసుకుని బాగా కలిపి దాన్ని ముఖానికీ, మెడకీ రాసుకోవాలి.. కాసేపు అయ్యాక కడిగేస్తే చర్మం అద్భుతంగా మృదువుగా తయారవుతుంది. 

 

క్యారెట్‌, బంగాళాదుంపని సమానంగా తీసుకుని ఉడికించాలి. ఆతరవాత మెత్తగా చేసి అందులో కొద్దిగా పసుపు, వంట సోడా, కాసిని గులాబీనీళ్లు చేర్చి పూతలా రాసుకోవాలి.. ఇలా రాసుకున్న తర్వాత ముఖం అందంగా మృదువుగా మెరిసి పోతుంది.

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: