కీరా శరీరానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇందులో ఉండే నీటి శాతం శరీరాన్ని కాపాడుతుంది. అయితే శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతుందో.. ఈ కీరా కొన్ని చిట్కాలతో ముఖాన్ని.. చర్మాన్ని.. జుట్టును అలానే కాపాడుతుంది. అయితే అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

 కీరాలో బ్లీచింగ్‌ లక్షణాలు ఉండటం వల్ల ముఖానికి ఇది టోనర్ లా పనిస్తుంది.. ఈ కీరా నుండి తీసిన రసాన్ని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి బయటకు తీసి దానితో ముఖాన్ని రుద్దుకుంటే చర్మంపై ఏర్పడ్డ నలుపు తగ్గి ముఖం మెరిసిపోతుంది. 

 

కీరాను ముక్కలుగా కోసి కాసేపు కళ్ళపై పెడితే అలసట తగ్గి కళ్ళకు ఉపశమనం లభిస్తుంది. 

 

ఎండ కాలం వచ్చేసింది కాబట్టి చర్మం కందిపోయి నల్లగా ఏర్పడుతుంది.. కీరా ముక్కలను మచ్చలపై పెడితే మచ్చలు మెల్లగా మాయం అవుతాయి. 

 

కీరా రసం కాస్త టమాటా రసం కలిపి ముఖానికి పూతలా రాసి కడిగేయాలి. ఇలా చెయ్యటం వల్ల చర్మ రంద్రాలు శుభ్రపడి ముఖం మీరిపోతుంది. 

 

కీరా రసాన్ని జుట్టుకు పట్టించిన మంచి లాభం ఉంటుంది.. వారానికి రెండు లేదా మూడు సార్లు పట్టిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: