మందారం ఆకుతో ఎన్ని లాభాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మందారం ఆకు పేస్ట్ ని వారానికి ఒకసారి జుట్టు పట్టిస్తే చాలు జుట్టు ఎంతో అందంగా. దృడంగా మారుతుంది... అలాంటి మందారం పేస్ట్ ను మనం ఎక్కడికి వెళ్లిన పెట్టుకోలేం.. కానీ నూనెను ఎక్కడికి వెళ్లిన పెట్టుకోగలం.. నూనెకు అంత శక్తి ఉంది. 

 

అలాంటి మందారం నూనెను ఎలా తయారు చెయ్యాలి? ఎలా వాడితే జుట్టు వత్తుగా.. చుండ్రు పోయి పెరుగుతుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

రెండు పెద్ద చెంచాల కొబ్బరి నూనె, రెండు చెంచాల ఆముదం, రెండు చెంచాల బాదం నూనెను తీసుకోవాలి. ఈ మూడు నూనెలతో మూడు విటమిన్‌ - ఈ మాత్రల నూనెను కలిపి అన్నింటినీ వేడిచేయాలి. ఆ తర్వాత ఇందులో గుప్పెడు మందారపూల ముద్ద కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. 

 

ఉదయాన్నే ఆ మందారం ముద్ద కలిపినా నూనెను వడబోసి ఓ సీసాలో తీసుకోవాలి. ఇక ఆ నూనెను ప్రతిరోజు నిద్రపోయేముందు  తలకు రాసుకుని మృదువుగా మర్దన చేసుకోవాలి. అలా మర్దన చేసుకున్న మరుసటి రోజు శీకాయ లేదా కుంకుడు కాయతో తలా స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే చాలు. జుట్టు చిట్లకుండా, రాలకుండా, నెరవకుండా ఉంటుంది. చూశారుగా.. మందారం నూనెను ఎలా చెయ్యాలి ? ఎలా వాడాలి అనేది ? ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే తయారు చేసుకొని మీ జుట్టును అందంగా దృఢంగా మార్చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: