సాధార‌ణంగా చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య జుట్టు రాల‌డం. ఎన్ని షాంపూలు మార్చినా.. ఎన్ని ప్ర‌యోగాలు చేసిన ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేము. అయితే జుట్టు ఊడ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బలహీన‌మైన చిగుళ్ళు. దీనికి ఆదిలోనే చెక్ పెట్ట‌క‌పోతే ఆ త‌ర్వాత చాలా బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. ఇక బలహీనమైన జుట్టు మూలాలకు చికిత్స చేయడానికి, మీరు ఎల్లప్పుడూ సహజమైన చికిత్సా పద్ధతులను ఆచరించాలి. అందులో వెల్లుల్లి కూడా ఒక‌టి. భారతీయ వంటలో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకాల్లో ఒకటి వెల్లుల్లి. అత్యధిక పోషక విలువలు వెల్లుల్లి జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. 

 

అలాగే వ‌ద్ద‌న్నా జుట్టును పెరిగేలా చేస్తుంది. మ‌రి కేశాల‌కు వెల్లుల్లిని ఎలా వాడాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నూనె, వెల్లుల్లితో కలిపి, జుట్టు రాలడానికి వ్యతిరేకంగా సహాయపడుతుంది. అందుకు ముందుగా రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు కొబ్బరి నూనెను లైట్‌గా వేడి చేసి వెల్లుల్లి జోడించండి. ఈ మిశ్రమాన్ని మీ తలపై అప్లై చేస్తూ కాసేపు మసాజ్ చేసుకుని అరగంట  తర్వాత సాధారణ షాంపూ ఉపయోగించి త‌ల‌స్నానం చేయండి.

 

ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల జ‌ట్టు రాల‌డానికి త‌గ్గించి పెరిగేలా చేస్తుంది. అలాగే మ్యాష్ చేసుకున్న గార్లిక్ క్లోవ్స్ ని ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ లో కలపండి. దీనిని ఒక జార్ లో చల్లటి తెంపేరేచర్ లో పొడి ప్లేస్ లో వారం పాటు భద్రపరచండి. ఆ తరువాత, ఈ ఆయిల్ ను శిరోజాల సంరక్షణకు వాడుకోవ‌చ్చు. ఈ ఆయిల్ వాడ‌డం వ‌ల్ల జుట్టు పొడవుగా, వేగంగా పెరిగేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో, ఐరన్, మినరల్స్ అలాగే విటమిన్స్ లభిస్తాయి. ఇవి జుట్టును పొడవుగా పెంచేందుకు తోడ్పడతాయి.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: