ఈ కాలం అమ్మాయిలు.. కేవలం ముఖం, చేతులు, కాళ్ళు మాత్రం అందంగా ఉండాలి అనుకోవటం లేదు.. ఆ చేతులకు ఉండే గోళ్లు.. కాళ్లకు ఉండే గోళ్లు శుభ్రంగా.. అందంగా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే అలా గోళ్లు అందంగా ఉండాలి అని ప్రతిసారి వాటికి పెడిక్యూర్.. మానిక్యూర్ చేయించారు కదా! అలా చేయించిన అవి అందగా తయారవుతాయి అనే నమ్మకం లేదు.. అందుకే ఇంట్లోనే సహజసిద్ధమైన చిట్కాలు ఉపయోగించి వాటిని అందంగా.. ఆరోగ్యంగా చేసుకోండి.

 

అరలీటరు గోరువెచ్చని నీటిలో టేబుల్‌ స్పూను సీ సాల్ట్‌, టేబుల్‌ స్పూను నిమ్మరసం కలపాలి. ఆ నీటిలో గోళ్లను కనీసం పదిహేను నిమిషాలు ఉంచి  ఆ తరువాత గోళ్లను పరిశుభ్రమైన నీటితో కడిగి మాయిశ్చరైజర్‌ రాసి మర్దన చెయ్యడం వల్ల గోళ్లు అందంగా తయారవుతాయి. 

 

4 టేబుల్‌ స్పూన్ల గోరువెచ్చని ఆలివ్‌ నూనెలో రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, కాస్త గుడ్డు సొన వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని చేతిగోళ్లకు ఉంచి మర్దన చేయాలి. పది, పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే గోళ్లు చిట్లకుండా ఆరోగ్యంగా ఉంటాయి.

 

మూడు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ నూనెలో టేబుల్‌ స్పూను నిమ్మరసం కలిపి అందులో గోళ్లను 10 నుండి 15 నిమిషాలు ఉంచాలి.  ఆ తరువాత కడిగేస్తే ఎంతో అందంగా కనిపిస్తాయి. 

 

అరకప్పు ఆలివ్‌నూనెను తీసుకుని అందులో గోళ్లను ఉంచి 20 నిమిషాల తరవాత తీసేసి కడిగి, తుడిచేయాలి. ఇలా తరచూ చెయ్యడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా అందంగా మారి తాజాగా కనిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: