జుట్టు ఒత్తుగా.. పొడవుగా.. ఆరోగ్యంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు. ఎందుకంటే.. ఆడ‌వారి అందంలో శిరోజాల‌కు కూడా ప్ర‌ముఖ్య‌త ఎక్కువ కాబ‌టి. కానీ కాలుష్యం, పోషకాహార లేమి కారణంగా నేడు అందమైన శిరోజాలు గగన కుసుమంలా మారాయి. జుట్టు రాలిపోతుంటే, చుండ్రు వేధిస్తుంటే, స్త్రీలకు కురుల చివర చిట్లుతుంటే షాంపూల వెంట షాంపూలు మారుస్తుంటారు. ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. కానీ, ఫలితం కనిపించదు. అయితే వారు ఓ సారి ఎగ్‌ను ట్రై చేసి చూడండి. ఖ‌చ్చితంగా ఫ‌లితం ఉంటుంది.

 

కోడిగుడ్డు పచ్చసొనలో లుటిన్ పుష్కలంగా ఉంటుంది.  ఇది మీ జుట్టుకు తేమను అందించి జుట్టు ఒత్తుగా మెరిసేలా చేస్తుంది. గుడ్డును జుట్టుకు అప్లై చేయడం ద్వారా జుట్టుకు మంచి షైనింగ్, అందంగా మరియు వాల్యూమనస్ గా ఉంటుంది. జుట్టు దుర్వాసన లేకుండా ఉండాలంటే గుడ్డులోని తెల్లసొన మాత్రమే ఉపయోగించి . ఎగ్ వైట్ లో ప్రోటీలనులు మరియు క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి జుట్టును మరియు జుట్టు మూలాలకు తగిన బలాన్ని చేకూర్చుతాయి.

 

ఇక అందుకు ముందుగా.. ఎగ్ వైట్‌లో నిమ్మరసం మిక్స్ చేసి, జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టు మరింత బెటర్ గా పెరగడానికి సహాయపడుతుంది. ఎగ్ వైట్ ను పాలతో మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల ఇది హెయిర్ వాల్యూమ్ ను పెంచుతుంది. ఎగ్‌వైట్‌లో బాదం పొడి మిక్స్ త‌ల‌కు ప‌ట్టించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చిట్లిన జుట్టును నివారించుకోవచ్చు. అలాగే ఎగ్‌వైట్‌లో రోజ్ వాట‌ర్ మిక్స్ చేసి త‌ల‌కు ప‌ట్టించి, ఆరిన త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయం వ‌ల్ల జుట్టు మెరుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: