ఏజ్ పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజం. కానీ, కొంద‌రికి ముప్పై ఏళ్లు రాక‌ముందు చ‌ర్మంపై ముడ‌త‌ల స‌మ‌స్య వేధిస్తుంటుంది.  ముఖచర్మంపై ముడతలు, సన్నని గీతలు లేదా చర్మం సాగటం వంటివి వృద్ధాప్యంలో వచ్చే చర్మ రుగ్మతలు. అయితే అతి త‌క్కువ వ‌య‌స్సులోనే మనం ఆ స‌మ‌స్య‌ల‌తో పెద్దవాళ్లగా కనిపించడం చాలా బాధను కలిగిస్తుంది. వయసు మాత్రమేకాకుండా, చాలా కారణాలు చర్మాన్ని ప్రభావితపరుస్తాయి.పోషకాల కొరత వలన కూడా చర్మంపై ముడతలు ఏర్పడతాయి.పొగతాగటం వలన కూడా చర్మంపై ముడతలు ఏర్పడతాయి.

 

ఇలా అనేక స‌మ‌స్య‌లు చ‌ర్మంపై ముడ‌త‌లు ఏర్ప‌డ‌తాయి. అయితే ఈ స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలిరా బాబూ.. అని చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. కానీ, ప‌రిష్కారం లేని స‌మ‌స్య ఏది ఉండ‌దు. ఇక అస‌లు విష‌యంలోకి వెళ్తే.. ముఖంపై ముడ‌త‌లు పోవ‌డానికి సింపుల్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ క్యారట్‌ జ్యూస్ తాగడం వల్ల‌ చ‌ర్మం మీద ముడ‌త‌లు తొలగిపోతాయి. మ‌రియు ముఖం కాంతివంతంగా మారుతుంది.

 

అలాగే చల్లటి నీటితో ముఖాన్ని క‌డిగి వెంటనే టవల్‌తో తడుచుకోకుండా అలాగే ఆరనిస్తే చర్మం కొంతమేర తేమను పీల్చుకుంటుంది. దీంతో చర్మానికి తాజాదనం ల‌భిస్తుంది. అలాగే గులాబీ నీటిని తీసుకుని అంతే మోతాదులో గ్లిజ‌రిన్‌ని క‌లుపుకోవాలి. ఈ రెండింటిలో కొన్ని చుక్క‌ల నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖంపై ముడ‌త‌లు సులువుగా త‌గ్గుతాయి. అదేవిధంగా కొద్దిగా కొబ్బ‌రినూనె తీసుకుని ముఖానికి రాసి సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ పెరిగి చ‌ర్మం ముడ‌త‌లు త‌గ్గించి తాజాగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: