ఇటీవ‌ల కాలంలో మేక‌ప్ లేని ముఖం క‌నిపించ‌డం చాలా క‌ష్టంగా మ‌రింది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌ని ఏవేవో మేక‌ప్ ప్రోడెక్ట్స్‌తో అల‌క‌ర‌ణ చేసుకుంటారు. అయితే మేకప్ కంటే మీ చర్మం ఆరోగ్యంగా ఉండ‌డం చాలా ముఖ్యం. వాస్త‌వానికి కొన్ని రకాల మేకప్‌ ఉత్పత్తుల్లోని రసాయనాలు చర్మం మీద ప్రభావం చూపుతాయి. వీటికి తోడు శుభ్రంగా లేని మేకప్‌ బ్రష్‌లు వాడడం వల్ల చర్మం దెబ్బతింటుంది. అందుకే మేకప్‌ సామగ్రి వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే బాగా అవ‌స‌రం అయిన‌ప్పుడే మేక‌ప్ ప్రోడెక్ట్స్‌ను ఉప‌యోగించాలి.

 

మ‌రి మేక‌ప్ లేకుండా ఎలా అని చాలా మంది అనుకుంటారు. అయితే మేక‌ప్ లేకుండా కూడా మెరిసిపోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కనుబొమ్మలు షేప్ చేసుకోవడం చాలా మంచిది. మేకప్ లేకున్నా కూడా అందంగా కనిపించాలంటే ఐ బ్రోస్ ని షేప్ చాలా అవ‌స‌రం. అందుకు మ‌న‌కు సోట్ అయ్యేలా  ఐ బ్రోస్ ని షేప్ చేయించుకోవాలి. అలాగే మీ చర్మతత్వం ఏదైనా సరే మాయిశ్చరైజర్ ను త‌ప్ప‌కుండా వాడాలి. ఎందుకంటే.. మాయిశ్చరైజర్ మీ చర్మానికి తగినంత తేమ అందుతుంది. 

 

ఆ త‌ర్వాత రాను రాను ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. చర్మానికి తగిన టోనర్ ని వాడడం ద్వారా కలిగే ఫలితం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా బ్రాండెడ్ టోనర్ ని వాడ‌డం చాలా ముఖ్యం. అలాగే ప్ర‌తిరోజు ప‌డుకునే ముందు ముఖానికి రోజ్ వాట‌ర్ అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఉద‌యానికి ముఖం కాంతివంతంగా మారుతుంది. దీంతో మేక‌ప్ లేక‌పోయినా అందంగానే క‌నిపించ‌వ‌చ్చు. ఇక ముఖంపై వెంట్రుకలను ఎప్ప‌టిక‌ప్పుడు తొలగించుకోవాలి. ఇలా చేయ‌డం ద్వారా అందమైన లుక్ ను పొందొచ్చు.

  
 

మరింత సమాచారం తెలుసుకోండి: