మనం ఎంతో అందంగా ఉండాలి అని.. సహజంగా కాకుండా ఎన్నో రక రకాల ఉత్పత్తులను.. సామాగ్రిని ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా కళ్ళకు మస్కారా.. పేదలకు లిప్ స్టిక్ ఓ రేంజ్ లో ఉపయోగిస్తున్నాం. అయితే అలాంటి వాటిని పక్కవారితో పంచుకోకపోవడమే మంచిది.    

 

మేకప్ ఉత్పత్తులు ఉపయోగించినప్పుడు ఇబ్బంది కల్గిన.. నవ్వలు పెట్టినా అందులో సూక్ష్మక్రిములు ఉన్నట్టే అని అర్థం చేసుకోవాలి. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే ఆల్కహాల్ ను ఓ స్ప్రే బాటిల్ లో వేసి సూక్ష్మక్రిములు ఉన్న ఉత్పత్తులపై స్ప్రే వేసి ఆరనివ్వాలి. అప్పుడు వాటిని వాడుకోవాలి. 

 

మేకప్ ఉత్పత్తులను చేతులతో అస్సలు తాకొద్దు.. శుభ్రమైన బ్రష్‌లను ఉపయోగించి మేకప్ వేసుకోవాలి.. లేకుంటే వాటిలో సూక్ష్మజీవులు చేరి పాడయ్యే అవకాశం ఉంది. వారానికి ఒకసారైనా బ్రష్ లను శుభ్రం చేసుకుంటే మంచిది. 

 

కాబట్టి ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: