సాధార‌ణంగా వయసుతో సంబంధం లేకుండా అమ్మాయిలు కోరుకునేది ఆక‌ర్షించే చర్మం. అయితే, చర్మాన్ని ఆక‌ర్ష‌వంతంగా కాంతివంతం చేసుకోవడం అంటే కాస్త క‌ష్ట‌మే అయినా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. ఇక ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్స్ ని వాడటం ద్వారా చర్మ సమస్యల నుంచి రక్షణ లభిస్తుందనుకుంటే పొరపాటే. ఇవి మీ జేబులకు చిల్లులు చేయడంతో పాటు చ‌ర్మాన్ని పాడుచేస్తాయి. అయితే మొటిమలు, బ్లాక్ హెడ్స్, లార్జ్ పోర్స్, డార్క్ సర్కిల్స్ వంటి కొన్ని రకాల చర్మ సమస్యలను తొలగించేందుకు కెమిక‌ల్ ప్రోడెక్ట్స్ కాకుండా.. వంటింటి చిట్కాల‌తో ఈజీగా చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

బంగాళ‌దుంప‌ రసంతో చర్మాన్ని రిన్స్ చేయాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో చర్మాన్నిశుభ్రపరచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బంగాళ‌దుంప‌లో సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్స్ స్కిన్ పిగ్మెంటేషన్ ను తగ్గించేందుకు సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే చిటికెడు ప‌సుపు ని ఒక టీస్పూన్ రోజ్ వాటర్ లో కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేషియల్ స్కిన్ పై అప్లై చేయాలి. కొంత స‌మయం తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇది కెమికల్ బ్యూటీ ప్రాడక్ట్స్ కంటే సమర్థవంతంగా పనిచేస్తుంది. 

 

ఈ నేచురల్ ఇంగ్రిడియెంట్ ని తరచూ వాడటం ద్వారా యాక్నే బ్రేక్ అవుట్స్ ని నివారించవచ్చు. అదేవిధంగా సొర‌కాయ ముక్క‌ల‌ను తీసుకుని మూసివున్న కనురెప్పలపై అమర్చండి. పావు గంట‌ తరువాత ఈ ముక్క‌ల‌ను తొలగించి గోరువెచ్చటి నీటితో చర్మాన్ని క్లీన్ చేసుకోండి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సొర‌కాయ‌లో పుష్కలంగా లభిస్తాయి. అందువలన, కంటి కింద నల్లటి వలయాలను తొలగించే సామర్థ్యం కుకుంబర్ కు కలదు.

  
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: