అందంగా ఉండాలి అని అందరూ అనుకుంటారు. కానీ కొందరికే అది సాధ్యం అవుతుంది. ఎందుకంటే కొందరు అందంపైన శ్రద్ద తీసుకుంటారు. మరికొందరు ఎలాంటి శ్రద్ద తీసుకోరు. ఇకపోతే మనం అందంగా కనిపించడానికి కళ్ళకు.. ఎన్నో రకాల మేకప్ వేస్తాం. కానీ ఆ మేకప్ లు కళ్ళను నల్లగా చేస్తాయి. 

 

అంతేకాదు... కొందరు మహిళలు రాత్రిపూట పని చేస్తుంటారు.. అలాంటి వారికీ కంటి చుట్టూ నల్లని వలయాలు వస్తాయి. మరి కొంతమంది లెట్ గా పడుకోవడం వల్ల.. సరైన ఆహారం లేకపోవడం వంటి లోపాల వల్ల కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడుతాయి. అలా ఏర్పడిన నల్లని వలయాలకు చెక్ పెట్టాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాదు. 

 

అలాంటివారు ఇంట్లోని చిట్కాను ప్రయత్నించి చూడండి. ఆ చిట్కా ఏంటి అంటే? గంధం తీసే చెక్కపై జాజికాయను రుద్ది ఆ వచ్చిన సారాన్ని కంటి చుట్టూ రాత్రి సమయంలో రాసి పడుకోండి. ఉదయాన్నే చల్లని నీటితో కడగండి. జాజికాయ, గంధపు చెక్కలో ఉన్న చల్లదనం మీ కంటికి చల్లదన్నానిచ్చి నల్లటి వలయాలను తొలగిస్తుంది. ఈ చిట్కాను ప్రతి రోజు ఉపయోగించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: